‘‘అమ్మాయిపై రూమర్స్ వస్తే అవి నిజమే అనుకుంటారు. అబ్బాయిపై అలాంటి వదంతులు వస్తే అమ్మాయే చేయించిందంటారు. అబ్బాయిలూ ఇకనైనా ఎదగండి. ఈ విషయంతో సంబంధం ఉన్న ఇరుపక్షాలు తమ పని తాము చూసుకుంటున్నాయి. మీరు మీ పని మీద, మీ కుటుంబం మీద దృష్టి పెట్టండి’’ అని సమంత ఆ ట్వీట్‌లో పేర్కొంది.
నెటిజన్స్‌కి సమంత స్ట్రాంగ్ కౌంటర్.. ట్వీట్ వైరల్
03:13 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:13 PM May 11, 2024 IST
Advertisement
ఇటీవల గూఢాచారి, మేజర్ సినిమాలతో మెప్పించిన నటి శోభిత ధూళిపాళ్లతో నటుడు నాగచైతన్య డేటింగ్‌లో ఉన్నాడంటూ గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో నటి సమంతపై ట్రోల్స్ మొదలయ్యాయి. సమంతనే ఇలా చేయిస్తోందంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె ఇవాళ ట్వీట్ చేసి ట్రోలర్స్‌కి గట్టిగానే సమాధానం చెప్పింది.
Advertisement
