For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Movie యువరాణి పాత్రలో కనిపించనున్న సమంత..

12:19 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:19 PM May 13, 2024 IST
movie యువరాణి పాత్రలో కనిపించనున్న సమంత
Advertisement

Movie టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి సమంత.. హిందీ తో పాటు పలు చిత్రాల్లో నటిస్తూ పాన్ఇండియా స్టార్ గా ఎదిగింది.. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, వెబ్‌సిరీస్‌లు కూడా చేస్తుంది. ఫ్యామిలీ మ్యాన్‌-2 వెబ్​సరీస్​, పుష్ప చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో పాపులారిటీ దక్కించుకున్న సమంత ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టింది.

అయితే ఇప్పటికే వరుణ్‌ దావన్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సమంత.. తాజాగా మరో ప్రాజెక్ట్‌కి ఓకే చేసినట్లు తెలుస్తుంది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురాన్ హీరోగా ఓ హారర్ కామెడీ చిత్రం తెరకెక్కనుంది. దినేష్‌ విజన్‌ మ్యాడాక్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న నాలుగో హారర్‌ చిత్రంలో సమంత నటిస్తున్నట్లు ఇందులో సమంత యువరాణి పాత్రలో నటించనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. అయితే వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందట. ఇందులో ఆయుష్మాన్ ఖురానా ఓ డ్రాక్యూలా తరహా పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఓ రాజస్థానీ జానపద గాధ ఆధారంగా తెరకెక్కించనున్నారని సమాచారం.

Advertisement GKSC

అయితే సమంత ఇటీవలే 'శాకుంతలం', 'యశోద' అనే పాన్‌ ఇండియా చిత్రాల్లో నటించింది. అయితే ఈ చిత్రాలు త్వరలోనే ఈ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ సరసన 'ఖుషి' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. వీటితో పాటే 'అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌' అనే విదేశీ చిత్రంలో కూడా సమంత నటిస్తుంది.

Advertisement
Author Image