For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Samantha: సమంతా ఏడాది బ్రేక్ తరువాత చేయబోయే సినిమాలు కేవలం కుర్ర హీరోలు.. కొత్త హీరోలతోనే అంటున్నసామ్ ..

01:47 PM Aug 16, 2023 IST | Sowmya
Updated At - 01:47 PM Aug 16, 2023 IST
samantha  సమంతా ఏడాది బ్రేక్ తరువాత  చేయబోయే సినిమాలు కేవలం కుర్ర హీరోలు   కొత్త హీరోలతోనే అంటున్నసామ్
Advertisement

Samantha : టాలీవుడ్ బ్యూటీ స్టార్ సమంత తాను చేయబోయే  కొత్త సినిమాలపై ఓ ఇంట్రస్టింగ్ ఆప్డేట్ వచ్చింది. సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయిన సామ్ ఆ తర్వాత ఎలాంటి సినిమా చేయాలనుకుంటుందో తెలుసా.. కుర్ర హీరోలతో కిక్ ఎక్కించే మంచి రొమాంటిక్, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ప్లాన్ చేస్తోందని టాలీవుడ్ సమాచారం. కుర్ర హీరోలు.. కొత్త హీరోలతో తీయబోయే స్టోరీలతో వచ్చే కథలనే వింటోందట సామ్. ఇందులో నిజమెంతోగాని టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

సమంత హెల్త్ ఇబ్బందుల వల్ల ఇటీవల సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుని.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన సామ్ తన నిర్ణయాన్ని కాస్త సడలించిందట. లాంగ్ బ్రేక్‌ను ఏడాదికే పరిమితం చేసి ఆ తర్వాత మళ్లీ సెట్స్‌పైకి రావాలని చూస్తోందట సమంత. వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే సమంత మయోసైటిస్ వ్యాధితో చాలా ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. మెరుగైన చికిత్సతో మళ్లీ సినిమాలు చేసినా మునుపటిలా ఫిట్‌నెస్ లేకపోవడంతో కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని, మరింత ఆరోగ్యంగా రావాలని నిర్ణయించుకుంది.

Advertisement GKSC

ప్రస్తుతం ‘ఖుషి’ సినిమాతో పాటు ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ రావాలి సమంత దగ్గర్నుంచి. అన్ని కమిట్మెంట్ల నుంచి ఫ్రీ అయిన సామ్.. టాలీవుడ్, బాలీవుడ్‌ల్లో కొత్తగా ఏ ప్రాజెక్టు ఒప్పుకోలేదు. గతంలో తీసుకున్న అడ్వాన్సులను కూడా నిర్మాతలకు తిరిగి ఇచ్చేసిన సామ్ విరామం తర్వాత మాత్రం కొత్త హీరోలతో, కుర్రహీరోలతో లవ్ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీయాలని చూస్తోందట. అలాంటి కథలతో వచ్చేవారికే సమయం కేటాయిస్తూ.. హాయిగా విశ్రాంతి తీసుకుంటోంది బ్యూటీ స్టార్. సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి సినిమా చేయాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి బ్రేక్ తర్వాత సమంత ఎలాంటి సినిమాలతో వస్తుందో చూడాలి.

Advertisement
Author Image