For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Samantha : సమంత క్రేజ్ వేరే లెవెల్ లో ఉందిగా... భారీ కటౌట్స్ తో ఫ్యాన్స్ రచ్చ !

12:35 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:35 PM May 13, 2024 IST
samantha   సమంత క్రేజ్ వేరే లెవెల్ లో ఉందిగా    భారీ కటౌట్స్ తో ఫ్యాన్స్ రచ్చ
Advertisement

Samantha : సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన యశోద చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, ముకుందన్ కీలక పాత్రలలో నటించారు. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‏ తో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్, టీజర్, పోస్టర్స్‏ మూవీపై మరింత క్యూరియాసిటిని పెంచాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈరోజు విడుదలైన ఈ సినిమాను డైరెక్టర్స్ హరి, హరీష్ తెరకెక్కించారు.

దీంతో థియేటర్స్ వద్ద సమంత ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండటంతో సమంత అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సినిమా కోసం థియేటర్స్ కి వస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని నగరాల్లో యశోద సినిమా నడిచే థియేటర్స్ వద్ద సమంతకి భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు. దాదాపు చాలా థియేటర్స్ వద్ద సమంతకి భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. ఈ కటౌట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement GKSC

స్టార్ హీరోలకి ఏ మాత్రం తగ్గకుండా సమంతకి వస్తున్న క్రేజ్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒక హీరోయిన్ కి ఇన్ని చోట్ల కటౌట్స్ పెట్టడం ఇదే మొదటి సారి అని అంటున్నారు. మరోవైపు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండడం పట్ల సామ్ అభిమానులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్ లో సమంత మరోసారి ఒన్ విమెన్ షో గా ఈ సినిమాని నడిపించిందని చెబుతున్నారు.

Advertisement
Author Image