For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Gossip గాడ్ ఫాదర్ లో నటించడం సల్మాన్ కు ఇష్టం లేదా...

12:24 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:24 PM May 13, 2024 IST
gossip గాడ్ ఫాదర్ లో నటించడం సల్మాన్ కు ఇష్టం లేదా
Advertisement

Gossip చిరు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'గాడ్‌ ఫాదర్‌' మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో పాటు తార్ మార్ తక్కర్ మార్ సాంగ్ కూడా వచ్చేసింది. అయితే ఫస్ట్ లుక్ వచ్చినంత క్రేజ్ అయితే మాత్రం ఈ సాంగ్ లేదనే చెప్పాలి. శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సంగీతాన్ని అందించారు.. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇంకో ఆసక్తికర విషయం కూడా హల్చల్ చేస్తుంది.

ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూసిన తార్ మార్ తక్కర్ మార్ సాంగ్ సోషల్ మీడియాను ఒక ఊపేస్తుంది అనుకున్నారు.. కానీ ఆ సాంగ్ విడుదలయ్యాక అభిమానులకు నిరాశే మిగిలింది. ఇద్దరు స్టార్ హీరోల మీద ఇండియన్ మైకల్ జాక్సన్ ప్రభుదేవా కంపోజ్ చేసిన సాంగ్ అంటే ఎలా ఉంటుందో అని ప్రేక్షకులంతా ఆశగా ఎదురు చూసినా వాళ్లకు నిరాశ మిగిలింది. పాటలో లిరిక్స్.. కానీ స్టెప్స్ కానీ ఏ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ఇందులో సల్మాన్ ఖాన్ కూడా ఏదో అంటీ ముట్టనట్టు వ్యవహరించడంతో చిరు అభిమానులు హర్ట్ అవుతున్నారు. తనతో సల్మాన్ కు ఉన్న స్నేహం వల్లనే ఈ సినిమాలో నటించారంటూ చిరంజీవి చెప్పుకొస్తున్నా.. ఈ సాంగ్ చూసిన తర్వాత అందులో ఆ స్నేహం కనిపించడం లేదు.. ఇప్పుడే ఇలా ఉంటే సినిమాలో సల్మాన్ ఖాన్ ఎలా నటించి ఉంటారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

Advertisement GKSC

ఈ సినిమా లో పక్క పొలిటికల్ పాత్రలో కనిపించనున్నారు చిరు. రాష్ట్ర రాజకీయాల్ని ఏకచక్రంగా శాసించే వ్యక్తి వెనుక ఉండి నడిపించే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు చిరంజీవి... బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇందులో నయనతార చిరంజీవికి చెల్లిగా కనిపించనుంది. మరో ప్రధాన పాత్రలో సత్యదేవ్ నటించారు.

Advertisement
Author Image