For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Sakshi Dhoni :'ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి వీర అభిమానిని' అంటున్న కెప్టెన్ ధోని సతీమణి సాక్షి ....

03:13 PM Jul 25, 2023 IST | Sowmya
Updated At - 03:13 PM Jul 25, 2023 IST
sakshi dhoni   ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి వీర అభిమానిని  అంటున్న కెప్టెన్ ధోని సతీమణి సాక్షి
Advertisement

Sakshi Dhoni : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫాలోయింగ్ గురించి సపరేట్ గా చెప్పనవసరం లేదు. తన సినిమాలతో టాలీవుడ్, మాలీవుడ్, తాజాగా బాలీవుడ్ లో భారీ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. పుష్ప సినిమాతో కేవలం ఇండియా వైడ్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా ఫేమ్ ని తెచ్చుకున్నాడు. డేవిడ్ వార్నర్ (David Warner) వంటి క్రికెట్ స్టార్స్ కూడా అల్లు అర్జున్ ని విపరీతంగా అభిమానిస్తుంటారు. తాజాగా ఇండియన్ కూల్ కెప్టెన్ ధోని (MS Dhoni) సతీమణి సాక్షి కూడా బన్నీకి వీరాభిమానిని అంటూ చెప్పుకొచ్చింది.

ధోని ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సాక్షి సినిమాలు నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. తమ ప్రొడక్షన్ లో మొదటి ప్రాజెక్ట్ గా LGM (లెట్స్ గెట్ మ్యారీడ్) అనే తమిళ్ సినిమాని తీసుకు వస్తున్నారు. కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ (Harish Kalyan), లవ్ టుడే మూవీ ఫేమ్ ఇవానా (Ivana) జంటగా నటిస్తున్న ఈ మూవీ.. తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ కాబోతుంది. తమిళంలో ఇటీవల ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేశారు. తాజాగా తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ మీడియాతో హైదరాబాద్ లో ఇంటరాక్ట్ అయ్యారు.

Advertisement GKSC

ఈ ఇంటరాక్షన్ హీరోహీరోయిన్లతో పాటు నిర్మాత సాక్షి కూడా పాల్గొంది. ఇక ఈ కార్యక్రమంలో ఒక విలేకరి సాక్షిని.. ‘మీరు తెలుగు సినిమాలు ఏవైనా చూశారా?’ అని ప్రశ్నించాడు. దానికి సాక్షి బదులిస్తూ.. “నేను అల్లు అర్జున్ సినిమాలు అన్ని చూస్తాను. ఒకప్పుడు ఓటీటీ ఉండేది కాదు. కానీ యూట్యూబ్ లో తెలుగు మూవీస్ ని డబ్ చేసి పెట్టేవాళ్ళు. అలా అల్లు అర్జున్ సినిమాలు చూడడం మొదలుపెట్టి తనకి పెద్ద ఫ్యాన్ అయ్యిపోయాను. తను సినిమా చూస్తూనే పెరిగాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని బన్నీ అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు.

Advertisement
Author Image