Politics : బీఆర్ఎస్ పార్టీకి వైఎస్ఆర్సిపి మద్దతు ఇవ్వడంపై స్పందించిన సజ్జల..
Politics తెరాస పార్టీ తాజాగా బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే ఈ పార్టీ తెలంగాణ భవన్ లో తాజాగా ఆవిర్భావ వేడుకలు పూర్తిచేసుకుని ఢిల్లీకు పయనమవుతున్నారు ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యాలయాలు ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. తెరాస శ్రేణులు అయితే ఈ సందర్భంగా తెరాస పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతిస్తుందా అనే ప్రశ్నకు సజ్జల తనదైన రీతిలో స్పందించారు..
సోమవారం తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబు సీఎంగా ఉండగా బెంజ్ సర్కిల్‌ను బ్లాక్ చేసేవారు.. ఇప్పటికీ చంద్రబాబు, పవన్ రోడ్‌షోలు చేస్తూనే ఉన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు.. ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలను ప్రజలను గమనిస్తున్నారని.. ఎవరు చేసే పనులను ప్రజలు మర్చిపోరని.. వాటిని గుర్తు పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేస్తారని అన్నారు.. అలాగే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తారా అనే ప్రశ్నకు ఆ విషయం ఇంకా జగన్ సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కేవలం రాష్ట్ర అభివృద్ధి పైన ఆయన దృష్టి అంతా ఉందని.. అలాగే దేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని అయితే ప్రస్తుతానికి ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు.. అలాగే ప్రస్తుతం పూర్తి ఏకాగ్రత రాష్ట్ర భవిష్యత్తుపై వచ్చే ఎన్నికలపై ఉందని పక్క రాష్ట్రాల సహకారం తమకు ఉంటే కచ్చితంగా వారికి సహకరిస్తామని అయితే ప్రస్తుతానికి అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని జగన్ ఈ విషయంపై ఆలోచించి పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించాకే ఎటు అనేది తేలుతుందని అన్నారు.