For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

తండేల్ బుజ్జి తల్లి (సత్య)గా సాయి పల్లవి

Sai Pallavi’s Birthday Special Video From Naga Chaitanya Thandel Unveiled
10:56 PM May 09, 2024 IST | Sowmya
Updated At - 10:56 PM May 09, 2024 IST
Sai Pallavi’s Birthday Special Video From Naga Chaitanya Thandel Unveiled
తండేల్ బుజ్జి తల్లి  సత్య గా సాయి పల్లవి
Advertisement

నాగ చైతన్య, సాయి పల్లవిల జోడి ఇంతకు ముందు 'లవ్ స్టోరీ'తో  ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'తండేల్' లో వారి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, కెమిస్ట్రీతో మనల్ని ఆలరించబోతున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో అత్యంత భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈరోజు సాయి పల్లవి పుట్టినరోజు. నిన్న ఒక అందమైన పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్ ఈ రోజు ఒక ప్రత్యేకమైన పుట్టినరోజు వీడియోను విడుదల చేశారు. వీడియో ప్రారంభంలో సాయి పల్లవి  మునుపటి సినిమాల్లోని ఐకానిక్ పాత్రలను ప్రజెంట్ చేస్తోంది. ఆ తర్వాత ఆమెను తండేల్ బుజ్జి తల్లి (సత్య)గా పరిచయం చేశారు.

Advertisement GKSC

సాయి పల్లవి అద్భుతమైన నటి. ఆమె ఏడ్చినప్పుడు మనల్ని ఏడిపించి, నవ్వితే మన ముఖాల్లో చిరునవ్వు తెప్పించే పెర్ఫార్మర్. వీడియోలో పిల్లలతో సరదాగా సమయం గడపడం, వారితో ఆడుకోవడం ఆమెలోని మంచి హ్యూమన్ బీయింగ్ ని సూచిస్తున్నాయి. వీడియో చివరిలో నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ఒక అందమైన సన్నివేశాన్ని చూపుతుంది. గొప్ప నటిగానే కాకుండా గ్రేట్ హ్యూమన్ బీయింగ్ గా ఉండే సరికొత్త సాయి పల్లవిని ఈ పుట్టినరోజు స్పెషల్ వీడియో మనకు పరిచయం చేస్తోంది.

సాయి పల్లవి ప్రెజెన్స్ సినిమాకు హ్యుజ్  మైలేజ్ ఇస్తుంది. చై, సాయిపల్లవి జోడి మరో సారి తెరపై మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో 'తండేల్' అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వబోతోంది. ప్రేమకథే కాకుండా ఈ సినిమాలో చాలా అంశాలు ఉన్నాయి.

శామ్‌దత్ అందించిన విజువల్స్ కూల్ గా వున్నాయి. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఆకట్టుకునే బీజీఎంని అందించారు. టాప్ ఫామ్‌లో వున్న దేవిశ్రీ ప్రసాద్ బ్యూటీఫుల్ ఆల్బమ్ అందించారు. త్వరలో మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్.

Advertisement
Author Image