ఆహ్లాదకరంగా జరిగిన సాయిధన్సిక "షికారు" చిత్రం ప్రీ రిలీజ్ వేడుక
సాయిధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కె.వి. ధీరజ్, నవకాంత్, చమ్మక్ చంద్ర ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం `షికారు` శ్రీసత్యసాయిబాబాగారి ఆశీస్సులతో నాగేశ్వరి (పద్మ) సమర్పణలో పి.ఎస్.ఆర్. కుమార్ (బాబ్జీ, వైజాగ్) నిర్మాతగా శ్రీసాయి లక్ష్మీ క్రియేషన్స్ బేనర్‌మీద హరి కొలగాని దర్శకత్వంలో రూపొందింది. (యాన్ అన్‌లిమిటెడ్ ఫన్ రైడ్) అనేది ట్యాగ్‌లైన్. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయి యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాయి.
ఈ సినిమా జులై 1న విడుదలకాబోతుంది. సినిమాపై నమ్మకంతో చిత్రయూనిట్ ముందుగానే సినిమాను నెల్లూరులోని సిరీ థియేటర్‌లో నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు చూపించారు. అనంతరం వారు ఇచ్చిన అమేజింగ్ రెస్పాన్స్ చిత్రయూనిట్‌కు ఎనర్జీ ఇచ్చింది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్‌లో షికారు ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.
సాయి ధన్సిక మాట్లాడుతూ... షికారు సినిమాలో మొదటినుంచి పోస్టర్‌లో అందరిని చూపించారు. ఇందులో కనిపిస్తున్న అందరూ స్టార్సే. ఇలా డిజైన్ చేసిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈరోజు ఇంత ఆదరణ పొందేలా వుండడానికి కారణం టెక్నీషియన్స్ కృషి. నటీనటుల అభినయం. వారందరినీ నడిపించిన దర్శక నిర్మాతలు. నలుగు కుర్రాళ్ళ బాగా నటించారు. రచయిత కరణ్ నా బాడీ లాగ్వేజ్ ఎలా వుండాలో కూడా తెలియజేస్తూ ఎంకరేజ్ చేశారు. అదేవిధంగా ప్రసన్నకుమార్, బెక్కెం వేణుగోపాల్, డి.ఎస్.రావు ఎంతగానో పాజిటివ్‌తో మొదటి నుంచీ స్పందించారు. మొదటి నుంచి షికారు చిత్రంపై బాబ్జీగారు పూర్తి నమ్మకంతో వున్నారు. ఇందులో కంటెంట్‌తోపాటు కామెడీ ఎక్కువగా వుంటుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి అన్నారు.