For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

డీజే టిల్లు-2లో హీరోయిన్ రాధికా స్థానంలో మలయాళం బ్యూటీ ఎంట్రీ..!

10:37 AM May 13, 2024 IST | Sowmya
UpdateAt: 10:37 AM May 13, 2024 IST
డీజే టిల్లు 2లో హీరోయిన్ రాధికా స్థానంలో మలయాళం బ్యూటీ ఎంట్రీ
Advertisement

Gossips News : చిత్ర పరిశ్రమలో సక్సెస్ వస్తే అమాంతం వస్తుంది లేదా ఒక సినీ ఆఫర్స్ ఉండవని చెప్పుకోవాలి. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో సూపర్ హిట్ అందుకున్న చిత్రం డీజే టిల్లు. ఈ చిత్రంలో నటించిన హీరో కెరియర్ అమాంతం పెరిగిందని చెప్పుకోవాలి. ఒక్క సినిమాతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు సిద్ధు జొన్నలగడ్డ. ఈ చిత్రంలోని పాటలు గాని డైలాగులు గాని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సీజన్ కి ఒక పాటలా ఈ చిత్రంలోని పాటలు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు బాగా అలరించాయని చెప్పుకోవాలి. ఎక్కడ వెళ్లిన డీజే టిల్లు సాంగ్ వినిపించడం సర్వసాధారణమైన చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. అదేంటో చదివేయండి మరి.

విమల్‌ కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ నేహా శెట్టి జంటగా నటించిన విషయం అందరికీ తెలిసిందే.డీజే టిల్లు పార్ట్-2 కోసం అనుపమ పరమేశ్వరన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాధికాగా నటించిన నేహా శెట్టి ప్లేస్‌లో అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా చిత్ర యూనిట్
ప్రకటించపోయినా.. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అనుపమ కార్తికేయ 2 చిత్రంతో సూపర్ హిట్ అందుకోగా తన నటనకు కూడా ప్రశంసలు అందుకుంది ఈ మలయాళం బ్యూటీ.

Advertisement

ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ నిఖిల్‌తో కలిసి 18 పేజెస్ మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వరస చిత్రాలతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. చూడాలి మరి ఈ అమ్మడుకు ఈ ఏడాది అదృష్టం ఎలా వరుస్తుంది అనేది తెలియాలంటే ఈ ఏడాది వరకు ఆగాల్సిందే. అలానేడీజే టిల్లు పార్ట్-2 అనుపమ మెరుస్తుందో లేదో అనేది  తెలియాలంటే టీజర్ వచ్చేవరకు వెయిట్ చేయక తప్పదు.

Advertisement
Tags :
Author Image