For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Burra Prashanth Goud : లోకల్ నుంచి గ్లోబల్ గా ఎదిగినా నిర్మాత బుర్ర ప్రశాంత్ గౌడ్

07:16 PM Jan 18, 2024 IST | Sowmya
Updated At - 07:16 PM Jan 18, 2024 IST
burra prashanth goud   లోకల్ నుంచి గ్లోబల్ గా ఎదిగినా నిర్మాత బుర్ర ప్రశాంత్ గౌడ్
Advertisement

సామాన్యుడి నుంచి అసమాన్యంగా ఎదిగినా డిస్ట్రిబ్యూటర్ ప్రశాంత్ గౌడ్ 

కార్పొరేట్ కంపెనీలో మ్యానేజ్ మెంట్ ట్రైనీ స్థాయి నుంచి కంపెనీ డైరెక్టర్ స్థాయికి ఎదిగి, ఆ తరువాత ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జ్ బీటర్ గా, ప్రొడ్యూసర్ స్థాయికి చేరుకున్న అలుపెరగని వ్యక్తి బుర్ర ప్రశాంత్ గౌడ్. అంతటితో ఆయన ప్రయాణం ఆగలేదు. ఎంచుకున్న రంగంలో విజయం అందుకొని సంబరాలు చేసుకునే వారిని చూసుంటాము, కానీ ప్రశాంత్ గౌడ్ ఒక రంగంలో సక్సెస్ కొట్టి, మరో రంగాన్ని ఎంచుకొని అందులోనూ విజయం వైపు నడిచే దిశాలి. స్వయంకృషితో ఒక్కొక్కటి సాధిస్తూ నేడు ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపార, వాణిజ్య రంగాలను విస్తరింపచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అయిన బుర్ర ప్రశాంత్ గౌడ్, మ్యానేజ్ మెంట్ ట్రైనీ స్థాయి అనే చిన్న ఉద్యోగం నుంచి ప్రపంచ దేశాల్లో వ్యాపారం చేసే స్థాయికి ఎలా ఎదిగారు అని ఆయన్ను ఎవరన్నా అడిగితే.. నిరంతరం సమాజానికి ఏదో చేయలన్న తపన తనను ముందుకు నడిపిస్తుంది అని అంటున్నారు.

Advertisement GKSC

బుర్ర ప్రశాంత్ గౌడ్ దాదాపు 14 సంవత్సరాలుగా తెలుగుపరిశ్రమలో ఎనలేని సేవలందిస్తున్నారు. చిన్న సినిమాలను నిర్మించే నిర్మాతాలను ఒకే ఒక దిక్కు ప్రశాంత్ గౌడ్. ఆయన డిస్ట్రీబ్యూటర్ గా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే నిర్మాతగా మారారు. సార్ధక మూవీస్ పతాకాన్ని స్థాపించి ఇప్పటి వరకు 14 చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తున్నారు కానీ ప్రశాంత్ గౌడ్ 12 సంవత్సరాల క్రితమే పూంక్2 అనే చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించారు. దాదాపు 100 పైగా సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. ఎన్నో సినిమాలకు ఫైనాన్సర్ గా చేశారు. మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాలనే సదుద్దేశంతో ఇతర భాషా చిత్రాలను తెలుగులో డబ్బింగ్ చేశారు. అలాగే థియేటర్లు దొరకక ఇబ్బంది పడే నిర్మాతలకు ఆయనే వెన్నంటి ఉండీ.. తనకున్న ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్ల పరిచయంతో స్క్రీన్స్ లీజ్ తీసుకొని నిర్మాతలను ఆదుకున్న మనసున్న మనిషి. అందుకే ఆయనంటే పరిశ్రమలో అందరకి మంచి గౌరవము. అలాగే అన్ని ఏరియాల్లో ఆయనకు థియేటర్ల యాజమాన్యంతో పరిచయం ఉంది. దేశవ్యాప్తంగా సినిమా డిస్ట్రిబ్యూషన్ లో మంచి నెట్ వర్క్ ఉంది. అలాగే హైదరాబాదులో 11 థియేటర్లు, నైజాం ఏరియాలో 20 థియేటర్లు ఆయన చేతుల్లో ఉన్నాయి.

ఆయన సేవలు కేవలం చిత్ర పరిశ్రమకే అంకితం కాలేదు. సమాజం మీద బాధ్యతో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వర్తించారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకున్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో స్వయంగా ఆయనే రంగంలో దిగి ఆహారం, నిత్యవసర సరకులను పంపిణీ చేశారు. ఆ పాండమిక్ సమయంలో ఆయన సేవానిరితిని అందరూ ప్రశంసించారు. స్వయంగా రూ. 30 లక్షలను పేదప్రజలకు, సినీ కార్మికులకు ఖర్చు చేశారు. ఇది ఆయనలో ఉన్న మానవీయ కోణానికి నిదర్శనం. ఫార్మా, హెల్త్ కేర్, ఫిన్ టెక్, ఎడ్యూకేషన్, సాఫ్ట్ వేర్, టెక్నాలజీ రంగాలకు చెందిన ఎన్నో సంస్థలతో ఆయనకు వ్యాపార సత్సంబంధాలు ఉన్నాయి.

తన వ్యాపార రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరచాలనేది ఆయన ఆలోచన. గల్ఫ్ దేశాలలో ఒకటి ఆయన Oman లో వున్న రాయల్ కింగ్ హోల్డింగ్ అధినేత రెన్నీ జాన్సన్ తో ప్రశాంత్ గౌడ్ కు మంచి పరిచయం ఉంది. ఆ పరిచయంతో రాయల్ కింగ్ హోల్డింగ్ తో భాగస్వామ్యంగా గల్ఫ్ కంట్రీస్ అయిన ఓమన్ లో వ్యాపారం ప్రారంభించారు. రాయల్ కింగ్ హోల్డింగ్ డైరెక్టర్ ప్రశాంత్ గౌడ్ మరియు CMYF వ్యవస్థాపక అధ్యక్షలు రామదాస్ చందక సంయుక్తంగా సంక్రాంతి సంబరాలు వేడుకను మస్కట్ లో మూడు రోజుల సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. జనవరి 12 నుంచి 14 వరకు మూడు రోజులు అంగరంగ వైభవంగా జరిగిన ఈ సంక్రాంతి వేడుక ప్రపంచ నలుముల అందరిని ఆకర్షించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సీనియర్ హీరో, నిర్మాత డా. మురళీ మోహన్ వచ్చారు. కేవలం వినోదమే కాదు ఇందులో సామాజిక దృక్పథం కనబరిచారు. దాదాపు 20 సార్లకు పైగా రక్తదానం ఇచ్చిన 30 మంది యువతీయువకులను సత్కరించారు. ఇద్దరు అంబేద్కర్ సేవాసమితి మహిళామణులును నారిసేన అధినేత శ్రీ లతాచౌదరి శాలువతో సత్కరించడము విశేషం. ఈ కార్యక్రమం మొత్తానికి మూడు రోజులు ఆటలు, పాటలు కామెడీ స్కిట్స్ తో సంక్రాంతి సంబరాలు గల్ఫ్ లో ఘనంగా జరిగాయి.

రాయల్ కింగ్ హోల్డింగ్ తో వ్యాపార రంగంలో భాగస్వామ్యం అయినా బుర్ర ప్రశాంత్ గౌడ్ గల్ఫ్ కంట్రీ లోనే కాకుండా గ్లోబల్ గా వ్యాపార రంగాల్లో రాణించాలని అహర్నిశలు ఓ ఋషుల శ్రమిస్తున్నారు. బుర్ర ప్రశాంత్ గౌడ్ ఇది కేవలం పేరు మాత్రమే కాదు ఒక బ్రాండ్ లా మారబోతుంది అనడంలో అతిశయోక్తి లేదు.
ఒక మనిషిలో ఇన్ని కోణాలు ఉండటం అంటే సాధారణమైన విషయం కాదు. మన హైదరాబాద్ వాసి, మన తెలుగు వ్యక్తి అయినందుకు మనం గర్వపడాలి. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని, చిత్రసీమలో చిన్న నిర్మాతలకు ఆయన అందిస్తున్న సేవా ఇలానే కొనసాగాలని, ప్రపంచవ్యాప్తంగా ఆయన వ్యాపారం దూసుకెళ్లాలని అందరూ కోరుకుంటున్నారు.

Advertisement
Author Image