For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood Updates: వరంగల్‌లో డిసెంబర్ 14న నాని ‘శ్యామ్ సింగ రాయ్’ రాయల్ ఈవెంట్

10:43 PM Dec 10, 2021 IST | Sowmya
Updated At - 10:43 PM Dec 10, 2021 IST
tollywood updates  వరంగల్‌లో డిసెంబర్ 14న నాని ‘శ్యామ్ సింగ రాయ్’ రాయల్ ఈవెంట్
Advertisement

న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు.

ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటినుంచి ఇప్పటి వరకు సినిమా మీద అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఇక టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యంలో విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభించింది. రానున్న రోజుల్లో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను చిత్రయూనిట్ మరింత పెంచనుంది. తాజాగా శ్యామ్ సింగ రాయ్ రాయల్ ఈవెంట్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.

Advertisement GKSC

వరంగల్‌లోని రంగలీల మైదానంలో ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేయబోతోన్నారు. నానితో పాటు చిత్ర యూనిట్ అంతా కూడా ఈ ఈవెంట్‌‌లో పాల్గొననున్నారు.

Royal Event Of Nani’s Shyam Singha Roy In Warangal On December 14th,Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian,Director Rahul Sankrityan,telugu golden tv,my mix entertainments,teluguworldnow.comనటీనటులు : నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా, లీలా సామ్సన్, మనీష్ వద్వా, బరున్ చందా తదితరులు

సాంకేతిక బృందం :
దర్శకత్వం : రాహుల్ సంకృత్యాన్
నిర్మాత : వెంకట్ బోయనపల్లి
బ్యానర్ : నిహారిక ఎంటర్టైన్మెంట్
కథ : సత్యదేవ్ జంగా
సంగీతం : మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫర్ : సాను జాన్ వర్గీస్
ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్ వెంకట రత్నం (వెంకట్)
ఎడిటర్ : నవీన్ నూలి
ఫైట్స్ : రవి వర్మ
కొరియోగ్రఫీ : కృతి మహేష్, యశ్ మాస్టర్
పీఆర్వో : వంశీ-శేఖర్

Advertisement
Author Image