For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఎంపీ సంతోష్ కుమార్ గారి క్లాప్ తో ప్రారంభమైన రాకింగ్ రాకేష్ కొత్త చిత్రం

11:21 PM Aug 29, 2023 IST | Sowmya
Updated At - 11:21 PM Aug 29, 2023 IST
ఎంపీ సంతోష్ కుమార్ గారి క్లాప్ తో ప్రారంభమైన రాకింగ్ రాకేష్ కొత్త చిత్రం
Advertisement

గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై గరుడవేగ మేకింగ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ‘జబర్‌దస్త్’ షో తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. గరుడవేగ లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకు డీవోపీ గా పని చేసిన అంజి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనన్య హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రం లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. తెలంగాణ ఎంపీ (రాజ్యసభ) సంతోష్ కుమార్ క్లాప్ కొట్టారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి కెమరా స్విచాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ళ భరణి గౌరవ దర్శకత్వం వహించగా సాయి కుమార్ మేకర్స్ కి స్క్రిప్ట్ అందజేశారు. చిత్ర ప్రారంభోత్సవంలో తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఫౌండర్ రాఘవ, విఎన్ ఆదిత్య, ప్రవీణ, అనిల్ కడియాల, ధనరాజ్, తాగుబోతు రమేష్, అదిరే అభి తదితరులు పాల్గొన్నారు.

Advertisement GKSC

లాంచింగ్ ఈవెంట్ లో ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. రాకేష్ కి ఆల్ ది వెరీ బెస్ట్. తను ఇంకెన్నో చిత్రాలు చేయాలి. మంచి నటుడిగా, నిర్మాతగా గా పేరు తెచ్చుకోవాలని  కోరుకుంటున్నాను. చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.

మంత్రి రోజా సెల్వమణి మాట్లాడుతూ.. రాకేష్ నా కొడుకు లాంటివాడు. ఎప్పటి నుంచో తనకి లీడ్ రోల్ చేయాలని వుంది. ఈ సినిమాతో అది నెరవేరుతోంది.  ఈ సినిమా పెద్ద విజయం సాధించి మరెన్నో సినిమాలు చేసి ప్రజలకు ఆనందాన్ని పంచాలని  మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

తనికెళ్ళ భరిణి మాట్లాడుతూ.. రాకేష్  ప్రతిభావంతుడు. హీరోగా, నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టడం అనందంగా వుంది. రాకేష్ మా గురువు గారు రాళ్ళపల్లి గారి కూడా ఇష్టమైన శిష్యుడు. చిన్న సినిమాలు పెద్దగా అవుతున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి రాకేష్ మరో పది సినిమాకు చేసే స్థాయికి రావాలని కోరుకుంటున్నాను.

బిక్షపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాకేష్ బుల్లితెరపై ఇప్పటికే పాపులర్ . ఈ సినిమాతో ప్రజలకు వినోదం పంచె చిత్రాన్ని అందిస్తాడని ఆశిస్తున్నాను’’ అన్నారు.

నటీనటులు : రాకింగ్ రాకేష్, అనన్య
టెక్నికల్ టీం :
నిర్మాణం: గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్
నిర్మాత: జయలక్ష్మీ సాయి కుమార్
డీవోపీ, దర్శకత్వం:  గరుడవేగ అంజి
సంగీతం: చరణ్ అర్జున్
లిరిక్స్ : కాసర్ల శ్యామ్
ఆర్ట్ డైరెక్టర్ : బత్తుల మహేష్
రైటర్ : నవీన్ కోలా
పీఆర్వో : వంశీ శేఖర్

Advertisement
Author Image