For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Rocking Rakesh as hero : హీరోగా మారిన రాకింగ్ రాకేష్‌ .. పల్లె మట్టివాసన తెలిసే చిత్రంగా రూపొంద‌నున్నది ..

05:21 PM Aug 29, 2023 IST | Sowmya
Updated At - 05:21 PM Aug 29, 2023 IST
rocking rakesh as hero   హీరోగా మారిన రాకింగ్ రాకేష్‌    పల్లె మట్టివాసన తెలిసే చిత్రంగా రూపొంద‌నున్నది
Advertisement

Rocking Rakesh as hero : బ‌జ‌ర్ద‌స్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాకింగ్ రాకేష్‌. క‌మెడియెన్ గా కొన్ని సినిమాల్లో న‌టించ‌గా తాజాగా హీరోగా మారాడు. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై గరుడవేగ మేకింగ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 పై ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ఈ సినిమా ప్రారంభమైంది. గరుడవేగ లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకు డీవోపీ గా పని చేసిన అంజి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండ‌గా అనన్య క‌థ‌నాయిక‌గా న‌టిస్తోంది. చరణ్ అర్జున్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ క్లాప్ కొట్టాగా.. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ళ భరణి గౌరవ దర్శకత్వం వ‌హించి సాయి కుమార్ మేకర్స్ కి స్క్రిప్ట్ అందజేశారు.

Advertisement GKSC

చిత్ర ప్రారంభోత్సవంలో తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఫౌండర్ రాఘవ, విఎన్ ఆదిత్య, ప్రవీణ, అనిల్ కడియాల, ధనరాజ్, తాగుబోతు రమేష్, అదిరే అభి తదితరులు పాల్గొన్నారు. అనంత‌రం అంద‌రూ క‌లిసి కొన్ని మొక్కలు నాటారు. ఈ చిత్రాన్ని ఒక పల్లె మట్టివాసన తెలిసే చిత్రంగా రూపొంద‌నుంద‌ని చిత్ర బృందం తెలిపింది. ఇక
పల్లెటూరి నిజజీవిత కథకు దగ్గరగా వుండబోతున్నట్టు తెలిపారు .

Advertisement
Author Image