For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: రెజీనా, నివేదా థామస్‌లు ఇద్దరూ కూడా మిలటరీ: ‘శాకిని డాకిని’ ఫస్ట్ లుక్

10:39 PM Dec 13, 2021 IST | Sowmya
Updated At - 10:39 PM Dec 13, 2021 IST
film news  రెజీనా  నివేదా థామస్‌లు ఇద్దరూ కూడా మిలటరీ  ‘శాకిని డాకిని’ ఫస్ట్ లుక్
Advertisement

సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో ఓ బేబీ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రెండో చిత్రంగా శాకిని డాకిని ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

నివేదా థామస్ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 2న విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. నేడు రెజీనా పుట్టిన రోజు సందర్బంగా మేకర్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రెజానీ, నివేదా థామస్‌లు ఇద్దరూ కూడా మిలటరీ యూనిఫాంలో ఉన్నారు. ఏదో తప్పు చేసి దొరికినట్టు, పనిష్మెంట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. పోస్టర్‌ను చూస్తుంటే సినిమా మీద ఆసక్తిని పెంచుతోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్లు ఇద్దరూ కూడా మొదటిసారిగా యాక్షన్ సీక్వెన్స్‌లు చేశారు.

Advertisement GKSC

Regina Cassandra, Nivetha Thomas, Suresh Productions, Guru Films and Kross Pictures Saakini Daakini First Look Out,Latest Telugu Movies,telugu golden tv,my mix entertainments,teluguwworldnow.com

నటీనటులు : రెజీనా, నివేదా థామస్

సాంకేతిక బృందం :

డైరెక్టర్ : సుధీర్ వర్మ
స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : అక్షయ్ పూళ్ల
నిర్మాతలు : డి సురేష్ బాబు, సునీతా తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్
ప్రొడక్షన్ కంపెనీ : సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్
సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ప్రసాద్
సంగీతం : మిక్కీ మెల్క్రెరీ
ఎడిటర్ : విప్లవ్ నైషధం
లైన్ ప్రొడ్యూసర్ : విజయ్ శంకర్ దొంకడ
ఆర్ట్ డైరెక్టర్ : గాంధీ నడికుడికర్
పీఆర్వో : వంశీ-శేఖర్
పిబ్లిసిటీ డిజైన్ : అనిల్ భాను

Advertisement
Author Image