For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood News: ఫిబ్ర‌వ‌రి 4న గ్రాండ్ గా విడుద‌ల‌వుతోన్న"రియ‌ల్ దండుపాళ్యం"

04:21 PM Jan 28, 2022 IST | Sowmya
Updated At - 04:21 PM Jan 28, 2022 IST
tollywood news  ఫిబ్ర‌వ‌రి 4న గ్రాండ్ గా విడుద‌ల‌వుతోన్న రియ‌ల్ దండుపాళ్యం
Advertisement

రామా నాయ‌క్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వైష్ణో దేవి ప‌తాకంపై రాగిణి ద్వివేది, మేఘ‌న రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో రూపొందిన చిత్రం `రియ‌ల్ దండుపాళ్యం`. మ‌హేష్ ద‌ర్శ‌క‌త్వంలో సి.పుట్ట‌స్వామి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 4న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టియ‌ఫ్‌పిసి సెక్ర‌ట‌రి టి. ప్ర‌స‌న్న‌కుమార్ మాట్లాడుతూ...``మ‌గాడి దాష్టీకానికి ఆడ‌వారు ఎలా బ‌ల‌వుతున్నారో దండు పాళ్యం గ‌త సిరీస్ లో చూపించారు. కానీ ఈ రియ‌ల్ దండుపాళ్యంలో మ‌హిళ‌లు వారిపై జ‌రిగే అకృత్యాలు, అన్యాయాల‌పై తిర‌గ‌బ‌డితే ఎలా ఉంటుందో చూపించే ప్ర‌య‌త్నం చేసార‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఈ ట్రైల‌ర్ చూశాక ఒక క‌ర్తవ్యం, ప్ర‌తిఘ‌ట‌న‌, మౌన‌పోరాటం చిత్రాలు గుర్తొచ్చాయి. ఈ సినిమా ప్ర‌తి మ‌హిళ చూడాలి. ఇన్ స్పైర్ అవ్వాలి. రాగిణి యాక్ష‌న్ ఎపిసోడ్స్ అద్భుతంగా చేసింది. ఫిబ్ర‌వ‌రి 4న వ‌స్తోన్న ఈ చిత్రం పెద్ద స‌క్సెస్ సాధించాల‌ని`` అన్నారు.

Advertisement GKSC

Real Dandupalyaam will be  grand released on February 4, Ragini Dwivedi, Meghna Raj,TFPC Secretary T. Prasannakumar,Telugu golden tv, my,mix entertainments,teluguworldnow.com 1ఈ కార్య‌క్ర‌మంలో మాన‌స‌, శ్యామ్ స‌న్, శేఖ‌ర్ నాయ‌క్‌, సందీప్ చౌహాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
రాగిణి ద్వివేది, మేఘన రాజ్, దీప్తి, ప్రధమ ప్రసాద్, సంయుక్త హర్నడ్, యువరాజ్, రఘు బట్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కో-ప్రొడ్యూస‌ర్ః కోయ‌ల్ బంజార‌, ఎమ్ బ‌స్వ‌రాజు నాయ‌క్ (ఎక్స్ ఎమ్మెల్యే) ; పీఆర్వోః చందు ర‌మేష్‌; నిర్మాతః సి.పుట్ట‌స్వామి, ద‌ర్శ‌క‌త్వంః మ‌హేష్‌.

Advertisement
Author Image