For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

వడ్డించడానికి రెడీగా ఉన్న 'రాజుగారి కోడిపులావ్'... జూలై 29న గ్రాండ్ రిలీజ్

10:32 PM Jul 05, 2023 IST | Sowmya
Updated At - 10:32 PM Jul 05, 2023 IST
వడ్డించడానికి రెడీగా ఉన్న  రాజుగారి కోడిపులావ్     జూలై 29న గ్రాండ్ రిలీజ్
Advertisement

ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం "రాజు గారి కోడిపులావ్" కుటుంబ కథా 'వి'చిత్రం అనేది శీర్షిక. ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. రాజుగారి కోడిపులావ్ చిత్రం నుంచి విడుదల పాటలు, వీడియోలు మూవీ లవర్స్ అందరి దృష్టిని విపరీతంగా ఆకట్టుకొన్నాయి. 'రాజు గారి కోడిపులావ్' చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ముగించుకుని జూలై 29న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు ముస్తాబు అవుతోంది.

వైవిధ్యభరితంగా, ఎంతో వినూత్నంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. సోషల్ మీడియా నలుమూలల్లో ఎక్కడ చూసినా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ల హడావిడి జరుగుతోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. త్వరలోనే 'రాజు గారి కోడిపులావ్' చిత్ర ట్రైలర్ విడుదల కానుంది దీంతో ఈ చిత్రంపై మరిన్ని భారీ అంచనాలు ఏర్పడనున్నాయి.

Advertisement GKSC

నిర్మాతగా, డైరెక్షన్ బాధ్యతలు వహిస్తూనే శివ కోన ఈ చిత్రంలో డ్యాని పాత్రలో నటించారు. అలాగే అందరికి సుపరిచితుడు అయిన బుల్లితెర మెగాస్టార్ గా పేరున్న ఈటీవీ ప్రభాకర్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వీరితోపాటు నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటిస్తున్నారు.

రీ యూనియన్ బ్యాచ్ గా కలిసిన కొంతమంది స్నేహితులు సరదాగా గడపడానికి ఒక అడవి ప్రాంతానికి వెళ్తారు. అనుకోకుండా అక్కడ ఎదురైన విపత్కర పరిస్థితుల నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చేసిన సాహసమే రాజుగారి పులావ్ సినిమా. ఆద్యంతం సస్పెన్స్ క్రిమ్ థ్రిల్లర్ తో పాటు అందమైన ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కుటున్నట్లు తెలుస్తుంది. ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసి థియేటర్లో సీట్ల అంచున కూర్చోబెట్టే ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయని, ఈ సినిమా ఔట్ పిట్ పై మేకర్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు.

నిర్మాణాంతర పనులన్నీ ముగించుకొని 'రాజు గారి కోడిపులావ్' చిత్రం జూలై 29న విడుదలై, ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ సినిమాకు పవన్ గుంటుకు సినిమాటోగ్రాఫర్ గా అద్భుతమైన విజువల్స్ అందించాడని, అలాగే సినిమాకు ప్రాణం అయిన సంగీతాన్ని ప్రవీణ్ మనీ ప్రాణం పెట్టి పనిచేశారని, ఎడిటర్ గా బసవ శక్తివంచన లేకుండా పనిచేయటం వలన సినిమా విషయంలో ఎంతో నమ్మకంగా ఉన్నట్లు మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.

నటీనటులు : శివ కోన, ప్రభాకర్, కునల్ కౌశల్, నేహా దేష్ పాండే, ప్రాచి కెథర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు

బ్యానర్ : ఏఎమ్ఎఫ్, కోన సినిమా
నిర్మాతలు : అనిల్ మోదుగ, శివ కోన
డైరెక్టర్ : శివ కోన
సంగీతం : ప్రవీణ్ మని
సినిమాటోగ్రఫి : పవన్ గుంటుకు
ఎడిటర్ : బసవా
సౌండ్ డిజైన్ : జీ. పురుషోత్తమ్ రాజు
వీఎఫ్ ఎక్స్ : అండీ చంగ్
సౌండ్ మిక్సింగ్ : ఏ రాజ్ కుమార్
రచన సహకారం,ప్రొడక్షన్ కంట్రోలర్ : రవి సంద్రన
పీఆర్ఓ : హరీష్, దినేష్

Advertisement
Author Image