For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

స్పెయిన్ లోని ప్లాజా డి ఎస్పానాలో రవితేజ "ధమాకా" రొమాంటిక్ పాట చిత్రీకరణ

07:53 PM Mar 16, 2022 IST | Sowmya
Updated At - 07:53 PM Mar 16, 2022 IST
స్పెయిన్ లోని ప్లాజా డి ఎస్పానాలో రవితేజ  ధమాకా  రొమాంటిక్ పాట చిత్రీకరణ
Advertisement

మాస్ మహారాజా రవితేజ మరియు త్రినాధరావు నక్కిన ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ "ధమాకా" షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. నటి శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ‘డబుల్ ఇంపాక్ట్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్లైన్ తో ధమాకా వస్తుంది.

పాటల చిత్రీకరణ కోసం టీమ్ స్పెయిన్ వెళ్లింది. ప్రస్తుతం రవితేజ, శ్రీలీలపై ఓ పాటను ప్లాజా డి ఎస్పానా అనే హిస్టారికల్ లొకేషన్లో చిత్రీకరిస్తున్నారు. ప్లాజా డి ఎస్పానా స్పెయిన్ లోని సెవిల్లె లోని పార్క్ డి మారియా లూయిసాలో ఉన్న ప్లాజా. ఇది ప్రాంతీయ వాస్తుశిల్పంతో రూపొందిన ప్రపంచంలోనే ప్రత్యేకమైన ప్లాజా-ప్యాలెస్.

Advertisement GKSC

Ravi Teja's DHAMAKA A Romantic Song Being Filmed At Plaza de España In Spain, Telugu golden tv, my mix entertainments, teluguworldnow.com

తారాగణం : రవితేజ, శ్రీలీల

సాంకేతిక సిబ్బంది : దర్శకుడు: త్రినాధరావు నక్కిన, నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్, బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ఆర్ట్స్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల, PRO: వంశీ శేఖర్.

Advertisement
Author Image