Tollywood Movies: డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. మాస్ మహారాజా రవితేజ సగర్వ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో విష్ణు విశాల్ మీడియాతో ముచ్చటించారు.
నా స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుందని రవితేజ అన్నారు. ఈ మూవీ రఫ్ కట్ చూసి షూర్ షాట్ హిట్ అని అన్నారు. కచ్చితంగా హిట్ అవుతుందని చెప్పారు. నా కెరీర్‌లో ఈ సినిమా హయ్యస్ట్ బిజినెస్ చేసింది. తెలుగు ప్రేక్షకులు కమర్షియల్ సినిమాలు, కంటెంట్ సినిమాలను ఆదరిస్తారు.పాటల కంటే ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. ఈ సినిమాకు మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సినిమా సెకండాఫ్ మొత్తం కూడా యాక్షన్ పార్ట్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మ్యూజిక్ ఇచ్చారు. ట్రైలర్ చూసి చాలా మంది బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను మెచ్చుకున్నారు.
ప్రతీ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. ఏ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు. పాత మొహాలే ఉంటే.. తరువాత ఏం జరగుతుందో ఊహించేస్తారు. అందుకే ఈ సినిమాకు చాలా మంది కొత్త వారిని తీసుకున్నాం.