For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Mass Maharaj Raviteja : బర్త్ డే గిఫ్ట్ గా అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్న మాస్ మహారాజ్ రవితేజ..

10:06 PM Jan 24, 2023 IST | Sowmya
Updated At - 10:06 PM Jan 24, 2023 IST
mass maharaj raviteja   బర్త్ డే గిఫ్ట్ గా అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్న మాస్ మహారాజ్ రవితేజ
Advertisement

Mass Maharaj Raviteja : టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ.. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొడుతూ ఫుల్ జోష్‏లో ఉన్నారు. ఇటీవలే ఆయన నటించిన ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. ప్రస్తుతం ఇదే ఊపును కంటిన్యూ చేత్శే మరో హిట్ అందుకోవాలని చూస్తున్నారు రవితేజ. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దరకత్వంలో ‘రావణాసుర’ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాను ఆర్ టి టీమ్‌వర్క్స్, అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.

కాగా ఈ చిత్రంలో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తుండగా అనుఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 7, 2023న వేసవిలో థియేటర్స్ లో గ్రాండ్‌ గా విడుదల కానుంది. అయితే జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా మూవీ ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్ విడుదల చేయనున్నారు.

Advertisement GKSC

ఇప్పటికే రవితేజ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను విడుదల చేయగా దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. సుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను లాయర్ పాత్రలో ప్రజంట్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఈ వార్తతో రవితేజ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు రవితేజ టైగర్ నాగేశ్వరరావు అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు.

Advertisement
Author Image