For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి సినిమా అరుదుగా వస్తుంది: హీరోయిన్ రష్మిక మందన్న

08:44 AM Mar 01, 2022 IST | Sowmya
Updated At - 08:44 AM Mar 01, 2022 IST
ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి సినిమా అరుదుగా వస్తుంది  హీరోయిన్ రష్మిక మందన్న
Advertisement

అగ్ర హీరో శర్వానంద్ నటించిన కొత్త సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ చిత్రంలో నాయికగా రష్మిక మందన్న నటించింది. మార్చి 4న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన అనుభవాలను తెలిపింది నాయిక రష్మిక మందన్న. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ...

ఫస్ట్ లాక్ డౌన్ టైమ్ లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా స్క్రిప్టును దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పారు. కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాలో ఇంత మంది లేడీస్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా వాటిలో ఎవరు నటిస్తారనే ఉత్సుకతనే మొదట కలిగింది. ఈ సినిమాలో రాధిక, ఖుష్బూ, ఊర్వశి వంటి సీనియర్ నటీమణులతో  కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభవం.Rarely Get a Movie Like A Aadavallu Meeku Johaarlu, heroine Rashmika Mandanna interview,Sharwanand,telugu golden tv, my mix entertainments, teluguworldnow.com.1ఈ చిత్రంలో నా పాత్ర పేరు ఆద్య.  ఆమె ముక్కుసూటి మనిషి. మొహమాటంగా ఉండదు. అనుకున్నది చెప్పేస్తుంది. మనసులో ఏదో దాచుకుని డ్రామా క్రియేట్ చేయడం ఇష్టముండదు. సినిమా నిండా ఆడవాళ్లమే ఉంటాం కాబట్టి సెట్ లో మగవాళ్లంతా మమ్మల్ని చూసి ..వీళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో అంటూ ఇబ్బంది పడేవారు. హీరోయిజం ఉన్న సినిమాలు వస్తున్న ఈ టైమ్ లో మహిళల కోసం ప్రత్యేకంగా ఓ సినిమా చేయడం సూపర్బ్.

Advertisement GKSC

Advertisement
Author Image