For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Animal : రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' టీజర్ విడుదల

08:07 PM Sep 28, 2023 IST | Sowmya
Updated At - 08:07 PM Sep 28, 2023 IST
animal   రణబీర్ కపూర్  సందీప్ రెడ్డి వంగా  యానిమల్  టీజర్ విడుదల
Advertisement

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా క్రేజీ యాక్షనర్ ‘యానిమల్’ టీజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ-టీజర్‌తో ఆశ్చర్యపరిచిన మేకర్స్, ఈరోజు రణబీర్ కపూర్ పుట్టినరోజు ప్రత్యేక సందర్భంలో ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. రెండు నిమిషాల, 26-సెకన్ల యాక్షన్ ప్యాక్డ్ వీడియో ఇంటెన్స్, హై-ఆక్టేన్ స్టంట్‌లు, పవర్ ఫుల్ డైలాగ్‌లు, అద్భుతమైన విజువల్స్, బ్రిలియంట్ స్కోర్, వండర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లతో అలరించింది.

టీజర్ సినిమా కథ కి ఒక గ్లింప్స్ లా వుంది. ఇది తండ్రీ కొడుకుల పాత్రల్లో కనిపించిన అనిల్ కపూర్, రణబీర్ కపూర్ ల కథ. వారిమధ్య చాలా సంక్లిష్టమైన సంబంధం వున్నట్లు అనిపిస్తుంది. తండ్రి తనపై చేయి చేసుకున్నప్పటికీ హీరో తన తండ్రిని "ప్రపంచంలోని ఉత్తమ తండ్రి" అని నమ్ముతాడు. హీరో గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగి వెరీ వైలెంట్ గా మారతాడు. బాబీ డియోల్ క్లిప్ చివరిలో విలన్ గా పరిచయమయ్యారు.

Advertisement GKSC

పిల్లల గురించి రణబీర్,రష్మిక మందన్నల మధ్య చర్చతో టీజర్ ప్రారంభమవుతుంది. ఆమె అతనిని ఏదైనా అడగవచ్చు, అతను నిజాయితీగా ఉంటాడు, కానీ తన తండ్రి గురించి ఎప్పుడూ మాట్లాడొద్దని చెప్తాడు. వీరి సంభాషణ జరుగుతున్నపుడు చూపించిన రక్తపాతం, కారు ఛేజింగ్‌లు, ఇంటెన్స్ ఎలిమెంట్స్ చాలా ఎక్సయిటింగా వున్నాయి.

రణబీర్ రెబల్ గా మారడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. రా అండ్ రస్టిక్ యాక్షన్ సన్నివేశాలు సినిమా కోసం రణబీర్ పడ్డ కష్టాన్ని చూపిస్తున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పాత్రను ప్రెజెంట్ చేయడంలో తన మార్క్ చూపించారు. యానిమల్‌ను భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్ , ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ నిర్మించాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో విడుదల కానుంది.

Advertisement
Author Image