For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

రణబీర్ కపూర్, రష్మిక మందన్న, సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' డిసెంబర్ 1న

09:15 AM Jul 05, 2023 IST | Sowmya
Updated At - 09:15 AM Jul 05, 2023 IST
రణబీర్ కపూర్  రష్మిక మందన్న  సందీప్ రెడ్డి వంగా  యానిమల్  డిసెంబర్ 1న
Advertisement

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా యాక్షన్-థ్రిల్లర్ 'యానిమల్' ప్రీ-టీజర్ కొన్ని రోజుల క్రితం విడుదలై ట్రెమండస్ రెస్పాన్స్ తో అంచనాలు పెంచింది. యానిమల్‌ని థియేటర్లలో చూసేందుకు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదల వాయిదా పడింది. మొదట ఆగస్ట్ 11న విడుదల కావాల్సిన యానిమల్ డిసెంబర్ 1కి వాయిదా పడింది.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేసి వాయిదాకు గల కారణాన్ని చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అధికంగా ఉండటమే ఆలస్యానికి ప్రధాన కారణమని వివరించారు. సినిమాలో 7 పాటలు ఉన్నాయని, ఒక్కో పాటను ఐదు భాషల్లో పర్ఫెక్ట్ లిరిక్స్‌తో రికార్డ్ చేయడం బిగ్ టాస్క్ అని చెప్పారు. ప్రీ టీజర్‌లోని సీక్వెన్స్ సినిమాలో ఉందని కూడా స్పష్టం చేశారు.

Advertisement GKSC

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోని డైనమిక్ పవర్‌హౌస్‌ల కలయికలో విజనరీ భూషణ్ కుమార్ టి సిరీస్ పై భద్రకాళి పిక్చర్స్‌పై ప్రణయ్ రెడ్డి వంగాతో కలసి ఈ యాక్షన్ సాగాను నిర్మిస్తున్నారు.

రణబీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

తారాగణం : రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న

సాంకేతిక సిబ్బంది :

దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా

నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా

బ్యానర్లు: టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్

పీఆర్వో: వంశీ-శేఖర్

Advertisement
Author Image