For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Entertainment : నా గడ్డం వల్లే ఆ భారీ సినిమా ఫ్లాప్ అయింది.. రన్బీర్ కపూర్

12:42 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:42 PM May 13, 2024 IST
entertainment   నా గడ్డం వల్లే ఆ భారీ సినిమా ఫ్లాప్ అయింది   రన్బీర్ కపూర్
Advertisement

Entertainment బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తాజాగా షంషేరా సినిమాతో అలరించిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది అయితే తాజాగా ఎందుకు సంబంధించిన ఒక విషయం చెప్పుకొచ్చాడు ఈ హీరో.. తాను నటించిన  షంషేరా సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో కారణాన్ని వివరించారు స్టార్​ హీరో రణ్​బీర్​ కపూర్​.

రన్బీర్ కపూర్ తాజాగా రెడ్ సి ఇంటర్నేషనల్ ఫీల్డ్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు అయితే ఈ సందర్భంగా ఆయన నటించిన షంషేరా సినిమా ఎందుకు ఫ్లాపాయిందో చెప్పుకొచ్చారు... "ఈ సినిమా పరాజయం వెనక మేము చేసిన పొరపాట్లు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి నా గడ్డం. నేను ఈ సినిమా కోసం కృత్రిమ గడ్డాన్ని పెట్టుకున్నాను. ఎండలో షూటింగ్‌ చేసేటప్పుడు అది సహజంగా కనిపించలేదు. ముఖానికి అతుక్కున్నట్లు కనిపించేది. దీంతో అభిమానులకు చాలా ఎబ్బేట్టుగా కనిపించేది ఉన్న అందం కూడా పోయింది అలాగే చూడటానికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఈ కారణాలతోనే ఈ సినిమా హిట్ అవ్వలేదని నాకు అనిపిస్తుంది.." అని చెప్పుకొచ్చారు రణబీర్ కపూర్.. రణబీర్‌ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో సంజయ్ దత్, వాణి కపూర్, రోనిత్ రాయ్, సౌరభ్ శుక్లా నటించారు. చాలా అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశనే మిగిల్చింది.. దీని తర్వాత వచ్చిన బ్రహ్మస్త్ర సినిమా మాత్రం మంచి హిట్ను అందుకుంది..

Advertisement GKSC

Advertisement
Author Image