For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood Updates: ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన రానా దగ్గుబాటి '1945'

09:49 PM Dec 09, 2021 IST | Sowmya
Updated At - 09:49 PM Dec 09, 2021 IST
tollywood updates  ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన రానా దగ్గుబాటి  1945
Advertisement

బాహుబలి లాంటి సినిమా తరువాత హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి భిన్న రకాల చిత్రాలను ఓకే చేశారు. అందులో 1945 ఒకటి. ఈ పీరియడ్ డ్రామాను సత్యశివ తెరకెక్కించారు. ఈ ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సీ కళ్యాణ్ భారీగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

1945 సినిమా డిసెంబర్ 31న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో రానా బ్రిటీష్ జెండాను కాల్చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. స్వాతంత్ర్య సమర యోధుడి పాత్రను రానా పోషించారు.

Advertisement GKSC

ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్‌గా నటించారు. సత్యరాజ్, నాజర్, ఆర్జే బాలాజీ వంటి వారు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. సత్య కెమెరామెన్‌గా, గోపీ కృష్ణ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Rana Daggubati, Sathyasiva, CK Entertainments Pvt Ltd 1945 To Release On December 31st,Regina Cassandra,Sathyaraj, Nasser,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com.1

Advertisement
Author Image