For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'Ramayana: The Legend of Prince Rama' Movie Review

05:17 PM Jan 24, 2025 IST | Sowmya
UpdateAt: 05:17 PM Jan 24, 2025 IST
 ramayana  the legend of prince rama  movie review
Advertisement

సుమారు 31 సంవత్సరాల క్రితం జపనీస్ యానిమే స్టైల్ లో వాల్మీకి రామాయణం ఆధారంగా తీసుకుని 'రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' పేరున రామాయణాన్ని ఓ చిత్ర రూపంలో తెరకు ఎక్కించడం జరిగింది. జపాన్ కు చెందిన కోయిచి ససకి, యుగో సాకి అలాగే భారతదేశానికి చెందిన రామ్ మోహన్ కలిసి ఈ చిత్రాన్ని జడకెక్కించడం జరిగింది. అయితే 31 సంవత్సరాల క్రితమే జపాన్ లో విడుదలయి కొన్ని కారణాలవల్ల భారతదేశంలో విడుదల కాలేదు. అయితే ఇప్పుడు గీక్ పిక్చర్స్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్, ఏ ఏ ఫిలిమ్స్ కలిసి సంయుక్తంగా తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషలలో భారతదేశంలో విడుదల జనవరి 24వ తేదీన చేయడం జరిగింది.

కథ: సాధారణంగా వాల్మీకి రామాయణం అందరికీ తెలిసిందే. అయితే అదే రామాయణాన్ని ఆధారం చేసుకుని జపాన్ యానిమే స్టైల్ లో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. శ్రీరాముడికి సుమారు 15 సంవత్సరాల వయసు నుండి మొదలై రామ రావణుల యుద్ధం తరువాత పట్టాభిషేకం వరకు మధ్య జరిగిన రాబోయినాన్ని తీసుకొని చిత్రీకరించారు. శ్రీరాముడు శివధనస్సును విరవడం, సీతను పెళ్లి చేసుకోవడం, కైకేయి కు ఇచ్చిన మాట ప్రకారం తండ్రి మాట నిలబెట్టేందుకు శ్రీరాముడు 14 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేయడానికి సీత, లక్ష్మణులతో కలిసి అరణ్యానికి వెళ్లడం, దశరథ మహారాజు మరణించడం, భరతుడు రాముడు కోసం అడవికి వెళ్లడం, లక్ష్మణుడు సూర్పనక ముక్కు కోయడం, రావణుడు సీతను అపహరించడం, రాముడు హనుమంతుడిని కలవడం, సుగ్రీవ వానర సైన్యంతో కలిసి రాముడు అప్పటికే సీత లంకలో హనుమంతుడు ద్వారా తెలుసుకుని హనుమంతుడు లంక దహనం తర్వాత లంకపై యుద్ధానికి వెళ్లడం, రామ రావణ యుద్ధంలో రాముడు రావణుడిని పలమార్చిన తర్వాత అయోధ్యకు తిరిగి రావడం వరకు ఈ చిత్రం తలకెక్కించడం జరిగింది.

Advertisement

సాంకేతిక విశ్లేషణ:సాధారణంగా ఎన్నో సినిమాలు రామాయణాన్ని ఆధారంగా చేసుకుని వచ్చినప్పటికీ ప్రేక్షకులు ప్రతి సినిమాలు ఎంతో ప్రేమగా ఆదరిస్తారు. అయితే ఈ సినిమా జపనీస్ యానిమే స్టైల్లో రావడం విశేషంగా చెప్పుకోవాలి. సుమారు 1993లో ఈ చిత్రం రూపొందించడం జరిగింది. అయితే ఆ రోజుల్లోనే ఇంత మంచి యానిమే గ్రాఫిక్స్ చేయడం గొప్ప విషయం అని చెప్పకూడదు. గ్రాఫిక్స్ పరంగా కూడా ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా నిజమైన రూపొందించడం ఎంతో కష్టమైనప్పటికీ చాలా బాగా తీయడం జరిగింది. అయితే నిర్మాణ విలువలలో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా ప్రతి సీన్లోనూ జాగ్రత్త తీసుకుంటూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం స్క్రీన్ లకు అలాగే ప్రేక్షకులకు తగ్గట్లు 4Kలో విడుదల చేయడం మరో విశేషం.

సారాంశం:మనకు తెలిసిన రామాయణాన్ని మరింత అద్భుతంగా పిల్లలు ఇష్టంగా చూసే విధంగా 'రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' రూపొందించడం జరిగింది. కుటుంబ సమేతంగా పిల్లలతో కలిసి చూడదగిన చిత్రం ఈ రామాయణ.

Advertisement
Tags :
Author Image