For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

RRR : ఆర్ఆర్ఆర్ కు మరో ప్రతిష్టాత్మక అవార్డు.. ఈసారి ఏ కేటగిరీలో అంటే?

08:25 PM Jan 18, 2023 IST | Sowmya
Updated At - 08:25 PM Jan 18, 2023 IST
rrr   ఆర్ఆర్ఆర్ కు మరో ప్రతిష్టాత్మక అవార్డు   ఈసారి ఏ కేటగిరీలో అంటే
Advertisement

RRR : దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచుతుంది. జక్కన్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” లో రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటించారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను దక్కించున్న ఆర్ఆర్ఆర్ తాజాగా సియాటెల్ క్రిటిక్స్ పురస్కారం దక్కించుకుంది. ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీకి గాను ఈ చిత్రానికి అవార్డు లభించింది. ఈ విషయాన్ని సియాటెల్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా ఈ సినిమాలో విక్కీ ఆరోరా, ఇవాన్ కొస్టాడినోవ్, నిక్ పావెల్, రియచో వసిలెవ్ యాక్షన్ స్టంట్స్ కు కోఆర్డినేటర్లుగా పని చేశారు. ప్రేమ్ రక్షిత్, దినేశ్ క్రిష్ణన్ స్టంట్స్ కొరియాగ్రఫీ చేశారు. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. 14 కేటగిరీల్లో బరిలో ఉంది. నాటునాటు పాట అవార్డులకు షార్ట్ లిస్ట్ కూడా అయింది. ఈ నెల 24న ఆస్కార్ అవార్డులను ప్రకటించనున్నారు.

Advertisement GKSC

ఇక ఇటీవలే రాజమౌళి ప్రపంచంలోనే టాప్ డైరెక్టర్స్ అయిన స్టీవెన్ స్పిల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ లను కలిశారు. వారితో కలిసి ఆర్ఆర్ఆర్ గురించి కార్చిన విషయాలను రాజమౌళి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. స్టీల్ బర్గ్ తో ఉన్న ఫోటోని .. రాజమౌళి షేర్ చేస్తూ నా దేవుడ్ని కలిశారని పోస్ట్ చేశారు. స్టీవెన్ స్పిల్ బర్గ్ కి ఆర్ఆర్ఆర్ సినిమా, నాటు నాటు సాంగ్ నచ్చాయని చెప్పారన్నారు. అలానే గ్రేట్ జేమ్స్ కామెరాన్ ఆర్ఆర్ఆర్ ను చూశారు. సినిమా ఆయనకు ఎంతో నచ్చడమే కాకుండా, ఆ సినిమాను వీక్షించాలంటూ భార్య సుజీకి సూచించి, ఆయన కూడా ఆమెతో కలిసి మరోసారి చూశారు. మీతో 10 నిముషాలు మాట్లాడుతూ మా సినిమా గురించి అనలైజ్ చేయడం నమ్మలేకపోతున్నాను. నన్ను వరల్డ్ లో టాప్ అన్నందుకు థ్యాంక్ యు సర్ అని పోస్ట్ చేశారు.‘నేనిప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీ ఇద్దరికీ ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశారు.

Advertisement
Author Image