Entertainment : ఆ హీరో కోసం నేల మీద పడుకున్న రజినీకాంత్..
Entertainment కోలీవుడ్ లో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రజినీకాంత్ ఔన్నత్యం ఇప్పటికే పలుమార్లు బయట పడుతూ వచ్చింది దేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటుల్లో ఒకరిగా ఉన్న రజనీకాంత్ బయట మాత్రం ఎంతో సాధారణ జీవితాన్ని గడుపుతారు అలాగే తనతో పాటు పని చేసే సహాయం గా చూసుకునే ఆయన ఒకప్పుడు అతని షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన మరోసారి రజనీకాంత్ వ్యక్తిత్వాన్ని గురించి తెలుపుతుంది..
'దళపతి' సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అరవిందస్వామికి అప్పుడప్పుడే వరుస అవకాశాలు వస్తున్నాయి. హీరోగా నిలదొక్కుకుంటున్నాడు సూపర్ స్టార్ స్టేజ్ ను అందుకొని ఉన్నారు.. అలా ఒక రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత అది రజనీకాంత్ ఉండే గది అని తెలియక లోపలికి వెళ్లాడు అరవింద్ స్వామి. అప్పటికే ఆ గదిలో ఏసీ ఆన్ చేసి ఉండటంతో పక్కనే ఉన్న మంచపై పడుకొని హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. తెల్లారి లేచి చూసేసరికి రజనీ అదే గదిలో నేలమీద పడుకొని కనిపించారు. ఒక్కసారిగా గుండెలు గుభేలుమనటంతో.. నిద్రమత్తు ఒక్క దెబ్బకు వదిలిపోయింది. కంగారుగా బయటికి వెళ్లి యూనిట్ సభ్యులను విషయం ఏంటని ఆరాతీస్తే... ''నిన్న రాత్రి షూటింగ్ అయ్యాక మీరు వచ్చి రజనీ సర్ గదిలో ఆయన మంచం మీద పడుకొన్నారు. మిమ్మల్ని చూసి 'అతన్ని లేపొద్దు. అక్కడే పడుకోనీయండి' అని అసిస్టెంట్ డైరెక్టర్లకు చెప్పి ఆయన కూడా అక్కడే నేల మీద పడుకున్నారు'' అని చెప్పడంతో ఆశ్చర్యపోయిన అరవింద స్వామి రజనీకాంత్ వ్యక్తిత్వం ఎలాంటిదో నేరుగా చూశారు..