Entertainment : రజినీకాంత్ ఫేమస్ డైలాగ్స్ ఏంటంటే..
Entertainment స్టార్ రజనీకాంత్ డైలాగ్ చెప్పే తీరుకు అభిమానులు పడి చస్తుంటారు.. ఆయన బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ కి దేశ విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు అయితే ఆయన నటించిన కొన్ని సినిమాల్లో ఫేమస్ అయిన డైలాగులు..
అతి తెలివివాళ్లు సుఖంగా జీవించిందీ లేదు. తెలివి తక్కువ వాళ్లు అడుగంటి పోయిందీ లేదు.
న్యాయానికి బంధం బంధుత్వం ఒక్కటే.. ఒప్పు చేసిన వాడు బంధువు.. తప్పు చేసిన వాడు శత్రువు.
పొగిడేవాడు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు. తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టూ కాదు.
మీసం వచ్చినవాడల్లా మగాడు కాదు. మీ కోసం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎంత ఆస్తిపరుడైతే తిండిపెడతాడో వాడే అసలైన మగాడు.
తను సంపాదించిన డబ్బు అనుభవించకుండా దాచుకుని చచ్చిపోయేవాడు మూర్ఖుడు.
ఎవరైనా మనకి సహాయం చేస్తే తిరిగి వాళ్లకి నలుగురి ఎదుట కృతజ్ఞతలు చెప్పడం తెలుగువారి సాంప్రదాయం.
తెలుగు చిత్రాల్లో ఇక్కడ గాటు పెట్టుకొని మీసాలు మెలితిప్పుకొని లుంగీ కట్టుకుని పాత విలన్లు హే కబాలి అని పిలవగానే వంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతారే ఆ కబాలి అనుకున్నారా కబాలిరా.. - కబాలి
మంచివాడు మెుదట కష్టపడొచ్చు కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడొచ్చు కానీ ఓడిపోతాడు.
ఒకటి గుర్తు పెట్టుకో జీవితంలో కష్టపడకుండా ఏదీ రాదు. అలా వచ్చింది ఎన్నటికీ నిలవదు.
డబ్బు సంపాదిస్తే సొమ్ములు రావాలి సోకులు రావాలి అంతేకానీ కొమ్ములు రాకూడదు.
అతిగా ఆశ పడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు... - నరసింహ
ఈ భాషా ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్లు లెక్క
నాన్న పందులే గుంపుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది... - బాషా