‘ఆర్‌ఆర్‌ఆర్’ సీక్వెల్ ఉంటుందా.. జక్కన్న గుడ్‌న్యూస్!
12:35 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:35 PM May 13, 2024 IST
Advertisement
ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కి ప్రముఖ దర్శకుడు రాజమౌళి గుడ్ న్యూస్ చెప్పారు. కొద్దినెలల క్రితం ఆయన దర్శకత్వంలో విడుదలై ఘన విజయం సాధించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకు సీక్వెల్‌పై ఆయన క్లారిటీ ఇచ్చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్ 2’పై అభిమానులు అడిగిన ప్రశ్నపై జక్కన్న స్పందించారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు సీక్వెల్ ఉంటుందని.. ఇప్పటికే దీనిపై చర్చలు జరిగిగాయని చెప్పారు. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ దీనికి సంబంధించిన కథను రాసే పనిలో ఉన్నారని క్లారిటీ ఇచ్చారు.
జక్కన్న ప్రకటనపై ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే వివరాలను రాజమౌళి చెప్పకపోవడంపై సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 2030 ఆర్‌ఆర్‌ఆర్ 2 రిలీజ్ అవుతుందంటూ సైటిరికల్‌గా ట్వీట్లు చేస్తున్నారు.
Advertisement