ద్వాదశ రాశులు వారికి గోచార రీత్యా ఫిబ్రవరి 28 నుండి మార్చ్ 06th వరకు వారఫలాలు.
ద్వాదశ రాశులు వారికి గోచార రీత్యా ఫిబ్రవరి 28 నుండి మార్చ్ 06th వరకు వారఫలాలు.
మేష రాశి:
వీరు వాహనా ల విషయం లో కొంత జాగర్త గా ఉండాలి.సంతానం యొక్క విషయం లో ఖర్చు లు అధికం అవుతాయి.వ్యాపారస్తులకు సామాన్య లాభాలు. వృత్తి జీవితం లో ఉన్నత ఫలితాలు కలుగుతాయి.అధికారుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం లక్ష్మీనరసింహ స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం శ్రేయస్కరం.
వృషభ రాశి:
వీరి కి ఈ వారం రోజుల్లో దూ ర ప్రయాణాలు సూచించపడుతోంది.సంతానని కి ఉద్యోగ ప్రాప్తి .పని చేసే చోట గౌరవం పెరుగుతుంది.వైవాహిక జీవితం లో కొన్ని అభిప్రాయభేదాలు వచ్చే అవకాశం ఉంది.వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఈ రాశి వారు ఆర్థిక వృద్ధి కోసం కనకధారా స్తోత్రం చదవటం శ్రేయస్కరం.
మిథున రాశి:
విద్యార్ధుల కి అధిక శ్రమ సూచిస్తోంది.స్థిర ఆస్తులు కొనాలి అని అనుకునే వారు కొంత కాలం వేచి చూడటం మంచిది.వ్యాపారం లో,వృత్తి లో అధిక శ్రమ సూచిస్తోంది.వీరి సంతాననికి ఉత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయి.వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం గణపతి ద్వాదశ నామాలు చదవటం శ్రేయస్కరం.
కర్కాటక రాశి:
ఆరోగ్య పరంగా సామాన్య ఫలితాలు. స్వల్ప ఆదాయం అందుకుంటారు. గృహనికి సంబందించిన పనులలో ఖర్చులు అధికంగా ఉంటాయి.పనులు పూర్తి చేసే క్రమంలో వొత్తిడి కి గురి అవుతారు. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు.వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసo శివాలయ సందర్శన ఉత్తమం.
సింహ రాశి:
సంఘం లో గుర్తింపు,ఆరోగ్య పరంగా ఉత్తమ ఫలితాలు అందుకుంటారు.వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి.ఉద్యోగాలలో స్థాన చలనం.వ్యాపారం లో స్వల్ప లాభాలు.
వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం మరియు ఆర్థిక వృద్ధి కోసం మహా లక్ష్మి అష్టకం చదవటం శ్రేయస్కరం.
కన్య రాశి:
వీరి సంతానానికి ఉత్తమ ఫలితాలు.వృత్తి ,వ్యాపారాలలో గుర్తింపు.వాహన లాభం.నూతన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేస్తారు.విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు .వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం వెంకటేశ్వర స్వామి ని అర్చించటం ఉత్తమం.
తులా రాశి:
కళాకారులకి ,క్రీడాకారులకు ఉత్తమ ఫలితాలు.వృత్తిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది.వివాహ ప్రయత్నాలు కలిసివస్తాయి. విద్యార్ధులకి ఉద్యోగ అవకాశాలు కలసి వస్తాయి. వాహనాల విషయం లో జాగ్రత్తలు పాటించాలి. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం దుర్గ స్తుతి చెయ్యటం ఉత్తమం.
వృశ్చిక రాశి:
వీరి కి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది .దూర ప్రయాణాల లో ఇబ్బందులు ఎదురుకోనే అవకాశం కలదు.ఉద్యోగులకి స్థాన మార్పిడి కనిపిస్తోంది. విందు, వినోదాల లో పాల్గొంటారు. వ్యాపారస్థు ల కి కొంత తక్కువ లాభాలు కలుగుతాయి.వీరు ఉత్తమ ఫలితాలు కోసం సుబ్రమణ్య అష్టకం చదవటం శ్రేయస్కరం.
ధనస్సు రాశి:
వృత్తి లో ఆర్థిక వృద్ధి.పోటీ పరీక్షలో విజయం,గుర్తింపు.అనుకున్న కార్యాల లో మార్పుల వల్ల కొంత ఆలస్యంగా పనులు పూర్తి అవ్వటం జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి.వ్యాపారంలో ఉత్తమ లాభాలు కలుగుతాయి. బంధు మిత్రులతో కలిసి సమయాన్ని గడుపుతారు.వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శివాలయం సందర్శించడం మంచిది.
మకర రాశి:
వీరు ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది.ఆకస్మిక ధన లాభం. ప్రయాణాలు సూచిస్తున్నాయి.వీరి జీవిత భాగ స్వామి కి వృత్తి లో గుర్తింపు. నూతన పెట్టుబడులు పెట్టాలని అనుకునే వారికి మిశ్రమ ఫలితాలు.వారం మొదటిలో భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు సూచించ పడుతున్నాయి.
వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం వెంకటేశ్వర వజ్ర కవచము చదవటం శ్రేయస్కరం.
కుంభ రాశి:
వీరి యొక్క సంతానం దూర ప్రాంతాల లో స్థిరపడతారు.సొంత వూరు లో స్థిరాస్తులు కొనుగోలుకు సంబంధించిన ప్రయత్నాలు కలసి వస్తాయి .కుటుంబ సభ్యుల తో కలసి దర్శనీయ ప్రాంతాలు సందర్శిస్తారు. ఎడ్యుకేషనల్ రంగం లో వున్న వారికి కొంత ఊరట లభిస్తుంది. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ని ఆరాధించటం శ్రేయస్కరం.
మీన రాశి:
వీరికి వ్యాపార రీత్యా కలసి వస్తుంది.సోదరులకు ఆర్థికసహాయం అందిస్తారు.ఆరోగ్య రీత్యా వైద్యుల సూచనలు తీసుకుంటారు.విద్యార్ధులకి కళాశాల నియామకాల ద్వారా ఉద్యోగ లభించే సూచనలు వున్నాయి. వీరు ఉత్తమ ఫలితాల కోసం లక్ష్మి నరసింహ స్వామి ని ఆరాధించటం శ్రేయస్కరం.