For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

అమెరికా తర్వాత రెండో అతిపెద్ద క్యాంపస్‌ ★ అక్టోబర్‌లో ప్రారంభించనున్న ఐటీ దిగ్గజం

02:10 PM Mar 23, 2022 IST | Sowmya
Updated At - 02:10 PM Mar 23, 2022 IST
అమెరికా తర్వాత రెండో అతిపెద్ద క్యాంపస్‌ ★ అక్టోబర్‌లో ప్రారంభించనున్న ఐటీ దిగ్గజం
Advertisement

సాఫ్ట్‌వేర్‌, వైర్‌లెస్‌ టెక్నాలజీ, ప్రాసెసర్ల తయారీలో అంతర్జాతీయ దిగ్గజం క్వాలమ్‌ సంస్థ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. మంగళవారం రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అమెరికాలోని శాండియాగోలో క్వాలమ్‌ ప్రధాన కార్యాలయంలో సంస్థ సీఎఫ్‌వో ఆకాశ్‌ పాలీవాలా, ఉపాధ్యక్షులు జేమ్స్‌జిన్‌, లక్ష్మీ రాయపూడి, పరాగ్‌ అగాసే, డైరెక్టర్‌ దేవ్‌సింగ్‌ తదితర కంపెనీ సీనియర్‌ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.

హైదరాబాద్‌ నగరంలో వివిధ దశల్లో రూ.3,904.55 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నట్టు తెలిపిన క్వాలమ్‌.. మంత్రి కేటీఆర్‌తో తన పెట్టుబడి ప్రణాళికను పంచుకున్నది. వచ్చే ఐదేండ్లలో తమ సంస్థ విస్తరణతో 8,700 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు సుమారు 15 లక్షల 72 వేల చదరపు అడుగుల వైశాల్యంగల కార్యాలయం అందుబాటులోకి వస్తుందని తెలిపింది. పెట్టుబడికి ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని, అక్టోబర్‌ నాటికి హైదరాబాద్‌లో తమ కేంద్రం సిద్ధమవుతుందని తెలిపింది.

Advertisement GKSC

ఇప్పటికే పలు టెక్‌ దిగ్గజాలు ప్రపంచంలోనే అతి పెద్ద రెండో క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విషయాన్ని తెలిపిన కేటీఆర్‌, ఈ వరుసలో క్వాలమ్‌ చేరడంపై హర్షం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో సెమీకండక్టర్‌ చిప్‌ తయారీ రంగాల్లో తెలంగాణను మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు క్వాలమ్‌ పెట్టుబడి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సాఫ్ట్‌వేర్‌తో పాటు వ్యవసాయ, విద్యారంగాల్లో తెలంగాణలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడమే తమ విస్తరణ ప్రణాళిక లక్ష్యమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అగ్రిటెక్‌, విద్యారంగం, కనెక్టెడ్‌ డివైజ్‌ వినియోగం, స్మార్ట్‌సిటీ కార్యక్రమాల్లో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నట్టు కంపెనీల ప్రతినిధులు మంత్రికి వివరించారు.Qualcomm expansion in Hyderabad,Rs. 3,905 crores .. 8700 jobs in Hyd.,The second largest campus after America,Minister KTR,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.comఅనేక దేశాలను పరిశీలించాకే హైదరాబాద్‌ ఎంపిక: ఐటీ, డిజిటల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుకోసం ప్రపంచంలోని అనేక దేశాలు, ఇండియాలోని ఇతర రాష్ట్రాలను పరిశీలించాం. తెలంగాణలోని పారిశ్రామిక అనుకూలత, ప్రభుత్వ పారదర్శక విధానాలే హైదరాబాద్‌లో ఫిస్కర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి ప్రధాన కారణం. ఈ డెవలప్‌మెంట్‌ సెంటర్‌తో ఆటోమొబైల్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాలకు చెందిన 300 మంది టెక్‌ నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తాం.
– సీఈవో హెన్రిక్‌ ఫిస్కర్

Advertisement
Author Image