For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Prudhviraj : రెండో పెళ్లి గురించి ఓపెన్ అయిన నటుడు పృధ్వీరాజ్... ఏమన్నారంటే !

12:30 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:30 PM May 13, 2024 IST
prudhviraj   రెండో పెళ్లి గురించి ఓపెన్ అయిన నటుడు పృధ్వీరాజ్    ఏమన్నారంటే
Advertisement

Prudhviraj : ప్రముఖ న‌టుడు బ‌బ్లూ పృథ్విరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్ర‌త్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పృధ్వీ... ఆ తర్వాత విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కాగా గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటున్న పృథ్విరాజ్ ప్ర‌స్తుతం సీరియ‌ల్స్ లో న‌టిస్తున్నాడు. గ‌త కొద్ది రోజులుగా పృథ్వీ రెండో పెళ్లి చేసుకున్నారంటూ సోష‌ల్ మీడియాలో తెగ వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.

కాగా తాజాగా ఈ వార్తలపై పృథ్వీరాజ్ స్పందించారు. తన ప్రియురాలు శీతల్ తో కలిసి తొలిసారి మీడియా ముందుకు వచ్చిన ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ... “చాలామంది ఒక ముసలివాడు యువతి అని ఏవేవో మాట్లాడుతున్నారు. నాకు 100 ఏళ్ళు ఉన్నట్టు ఆమెకు 16 ఏళ్లు ఉన్నట్టు. కూతురు వయసు ఉన్న పిల్లలతో పెళ్లి సిగ్గు లేదా అని ట్రోల్స్ చేస్తున్నారు. వాస్తవానికి శీతల అనే అమ్మాయితో నేను రిలేషన్ లో ఉన్నాను.

Advertisement GKSC

నాకు 57 ఏళ్లు, శీతల్ కి 24 సంవత్సరాలు. మేము ఇద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. నా మొదటి భార్య బీనాతో గొడవ కారణంగా బయట ఉంటున్నాను. ఈ సమయం లోనే శీతల్ నాకు పరిచయమైంది. ఇద్దరం మంచి స్నేహితులం అయ్యాము. నన్ను పెళ్లి చేసుకోవాలని సీతలే చెప్పింది. మొదట నేను పెళ్లికి నేను ఒప్పుకోలేదు. బాగా ఆలోచించుకోవాలని కాస్త సమయం ఇచ్చాను. ఆమె ఫ్యామిలీ కూడా పెళ్లికి ఒప్పుకున్నారు అని చెప్పుకొచ్చారు పృధ్విరాజ్. ప్రస్తుతం వీరి ప్రేమ వ్యవహారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement
Author Image