For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

హాస్టల్ బాయ్స్ కష్టాలని ఎంటర్టైనింగ్ గా ప్రజెంట్ చేసిన ‘బాయ్స్ హాస్టల్’ ప్రొటెస్ట్ సాంగ్

11:58 PM Aug 16, 2023 IST | Sowmya
Updated At - 11:58 PM Aug 16, 2023 IST
హాస్టల్ బాయ్స్ కష్టాలని ఎంటర్టైనింగ్ గా ప్రజెంట్ చేసిన ‘బాయ్స్ హాస్టల్’ ప్రొటెస్ట్ సాంగ్
Advertisement

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, కంటెంట్ బేస్డ్ చిత్రాలని రూపొందించే చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్‌తో కలిసి కన్నడ బ్లాక్‌బస్టర్ 'హాస్టల్ హుడుగారు బేకగిద్దరే' ని 'బాయ్స్ హాస్టల్’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు తీసుకొస్తుంది. నితిన్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్  నటించిన ఈ చిత్రంలో  రిషబ్ శెట్టి, పవన్ కుమార్, షైన్ శెట్టి అతిథి పాత్రల్లో కనిపించారు. దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి కూడా ఒక నిర్మాతగా వరుణ్ గౌడ, ప్రజ్వల్ B. P. , అరవింద్ S. కశ్యప్‌లతో కలిసి గుల్‌మోహర్ ఫిల్మ్స్ , వరుణ్ స్టూడియోస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. పరంవా పిక్చర్స్ బ్యానర్‌పై రక్షిత్ శెట్టి సమర్పించారు.

ఈ చిత్రం గత నెలలో కన్నడలో విడుదలై యునానిమస్ పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే 20+ కోట్లు వసూలు చేసి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ & చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ కలిసి ఈ చిత్రాన్ని ‘బాయ్స్ హాస్టల్’ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Advertisement GKSC

తాజాగా ఈ చిత్రం నుంచి ప్రొటెస్ట్ సాంగ్ ని విడుదల చేశారు. హాస్టల్ బాయ్స్ కష్టాలని ఎంటర్టైనింగ్  గా ప్రజెంట్ చేసిన ఈ పాటని అజనీష్ లోక్‌నాథ్ క్యాచి ట్యూన్ గా కంపోజ్ చేశారు. సాయి చరణ్ పాడిన ఈ పాటకు భాస్కర భట్ల అందించిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందించగా సురేష్ ఎమ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ‘బాయ్స్ హాస్టల్' ఆగస్ట్ 26న విడుదల కానుంది.

Advertisement
Author Image