For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మాచో స్టార్ గోపీచంద్ 'భీమా' హీరోయిన్స్ గా ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ

10:39 PM Aug 10, 2023 IST | Sowmya
UpdateAt: 10:39 PM Aug 10, 2023 IST
మాచో స్టార్ గోపీచంద్  భీమా  హీరోయిన్స్ గా ప్రియా భవానీ శంకర్  మాళవిక శర్మ
Advertisement

మాచో హీరో గోపీచంద్, ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వంలో చేస్తున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భీమా'. సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గోపీచంద్ పుట్టినరోజ సందర్భంగా ఇదివరకే ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ విడుదలైయింది. గోపీచంద్‌ పోలీస్‌గా రగ్గడ్‌ లుక్‌లో కనిపించిన ఫస్ట్‌లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ రోజు, మేకర్స్ ఈ చిత్రంలో హీరోయిన్స్ ని అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో గోపీచంద్ కు జోడిగా ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాలో హీరోయిన్స్ ఇద్దరికి సమాన ప్రాధాన్యత ఉంటుంది.

Advertisement

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కుటుంబ భావోద్వేగాలు, ఇతర అంశాలతో కూడిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'భీమా' రూపొందుతున్న ఈ చిత్రంలో అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, జిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్, కిరణ్ ఎడిటర్. అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ  యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

Advertisement
Tags :
Author Image