For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

The Goat Life : మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రెస్టీజియస్ మూవీ 'ది గోట్ లైఫ్' (ఆడు జీవితం) ఏప్రిల్ 10న

07:38 PM Nov 30, 2023 IST | Sowmya
Updated At - 07:38 PM Nov 30, 2023 IST
the goat life   మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రెస్టీజియస్ మూవీ  ది గోట్ లైఫ్   ఆడు జీవితం  ఏప్రిల్ 10న
Advertisement

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన కొత్త సినిమా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం).హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ది గోట్ లైఫ్ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇవాళ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ది గోట్ లైఫ్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.

90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను ది గోట్ లైఫ్ లో చూపించబోతున్నారు. పూర్తిస్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా ది గోట్ లైఫ్ కావడం విశేషం. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ది గోట్ లైఫ్ సినిమా గురించి దర్శకుడు బ్లెస్సీ మాట్లాడుతూ - ది గోట్ లైఫ్ యూనివర్సల్ అప్పీల్ ఉన్న సబ్జెక్ట్. ఈ కథను వీలైనంత సహజంగా చూపించడాన్ని ఒక సవాల్ గా తీసుకున్నాం. వాస్తవ ఘటనల ఆధారంగా చేసిన రచన ఇది. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన అనూహ్య ఘటనలను ప్రేక్షకులకు వాస్తవిక అనుభూతిని కలిగించేలా తెరకెక్కించే ప్రయత్నం చేశాం. ది గోట్ లైఫ్ సినిమాను పలు దేశాల్లోని లొకేషన్స్ లో లార్జ్ స్కేల్ లో రూపొందించాం. ఇలాంటి సినిమాను థియేటర్స్ లోనే చూడాలి. అప్పుడే ఆ అనుభూతి కలుగుతుంది. ఏప్రిల్ 10న మీ ముందుకు సినిమాను తీసుకొస్తున్నాం. అన్నారు.

Advertisement GKSC

Advertisement
Author Image