Telugu Cinema and TV Junior Artist Association: తెలుగు సినీ అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా స్వామిగౌడ్, సెక్రటరీగా వల్లభనేని అనిల్ కుమార్ విజయం
President of the Telugu Cinema and TV Junior Artist Association Swamy Goud, Secretary Vallabhaneni Anil Kumar.Tollywood News, Telugu World Now,
Telugu Cinema and TV Junior Artist Association: తెలుగు సినీ అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా స్వామిగౌడ్, సెక్రటరీగా వల్లభనేని అనిల్ కుమార్ విజయం
ఆదివారం జరిగిన తెలుగు జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు స్వామిగౌడ్ మరోసారి విజయం సాధించారు. మొత్తం పోలైన 1630 ఓట్లలో ఆయనకు 1056 ఓట్లు రాగా..631 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వల్లభనేని అనిల్ కుమార్ సెక్రటరీగా విజయం సాధించారు. ఆయనకు 1037 ఓట్లు రాగా..601 ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. ట్రెజరర్ గా శేషగిరిరావు (శివ ) 399 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ సందర్భంగా...
సెక్రటరీ వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ.... గౌరవనీయులైన జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ సభ్యులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఎలక్షన్స్ లో ప్రత్యక్షంగా, పరోక్షంగా మాకు సపోర్ట్ చేసి ఇంత అఖండ మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదములు. ఇంతవరకు యూనియన్ చరిత్రలో ఇంత బారీ మెజారిటీ ఇచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ ల కొరకు మంచి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని మాట ఇస్తున్నాము. అని అన్నారు.