Politics : మరోసారి భారత రాష్ట్రపతి ఆంధ్ర ప్రదేశ్ పర్యటన..
Politics తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరోసారి ఆంధ్రకు రానున్నారు.. నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి ఆంధ్రకు రానున్నారు..
భారత రాష్ట్రపతి ద్రౌపది మూర్ము ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం ను దర్శించుకోవడానికి ఈనెల 26వ తారీఖున వస్తున్నారు. అలాగే ఈ నెల 26వ తేదీన ఆమె శ్రీశైలంలో పర్యటించనున్నారు. 12:15 గంటలకు శ్రీశైలం చేరుకోనున్న రాష్ట్రపతి.. మధ్యాహ్నం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అలాగే కేంద్ర టూరిజంశాఖ ద్వారా దేవస్థానం చేపట్టిన ప్రసాదం స్కీమ్ పనులను ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా పుణ్యక్షేత్రాలను పూర్తి స్థాయిలో డెవలప్ చేయనున్నారు. టూరిస్టులను ఆకర్షించేందుకు వీలుగా మరిన్ని సౌకర్యాలను కల్పించనున్నారు..
అలాగే ఆమె రాష్ట్రపతి హోదాలో మొదటిసారి ఆంధ్రకు వచ్చినప్పుడు పోరంకిలో ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సన్మానం చేశారు. అలాగే ఆ పర్యటనలో భాగంగా ఆమె మూడు రోజులు పాటు విజయవాడ విశాఖ తిరుపతి జిల్లాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చారు.. ఈసారి ఆమె శ్రీశైలం చేరుకొని దర్శనం అనంతరం పలు ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు ఈ సందర్భంగా ఆమెకు ఆహ్వానం పలికే నేతలు ఎవరెవరు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.. అలాగే ఎన్ని రోజులు పర్యటననే పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉండగా రాష్ట్రపతి రావటానికి వీలుగా మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు