For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఘనంగా 'ఆదిపురుష్' రామ కోటి ఉత్సవం

07:11 PM Jun 19, 2023 IST | Sowmya
Updated At - 07:11 PM Jun 19, 2023 IST
ఘనంగా  ఆదిపురుష్  రామ కోటి ఉత్సవం
Advertisement

ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ఇతిహాసిక చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాను దర్శకుడు ఓం రౌత్ రూపొందించారు. కృతి సనన్ సీతగా కనిపించింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

గత శుక్రవారం విడుదలైన ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో రామ జయం, రఘురామ జయం పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించారు.

Advertisement GKSC

ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు ఆదిపురుష్ సినిమా చూసిన తర్వాత తమకు కలిగిన అనుభూతిని వేదిక మీద పంచుకున్నారు.

ఈ సందర్భంగా మాటల రచయిత భీమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ... యుగాలు, తరాలు మారినా రామ కథ మారదు. రాముడి మీద మనకున్న భక్తి, గౌరవం మారవు. తెలుగు ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదిపురుష్ చిత్రాన్ని చూస్తున్నారు. ఈ చిత్రానికి పనిచేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. అన్నారు.

Advertisement
Author Image