For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'ఓ మంచి ఘోస్ట్' చిత్రం నుంచి 'ఓ పాప నువ్వు తోపు' అనే మరో బీట్ సాంగ్

09:38 PM Jun 20, 2023 IST | Sowmya
Updated At - 09:38 PM Jun 20, 2023 IST
 ఓ మంచి ఘోస్ట్  చిత్రం నుంచి  ఓ పాప నువ్వు తోపు  అనే మరో బీట్ సాంగ్
Advertisement

''ఓ మంచి ఘోస్ట్'' (OMG) శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వైవిధ్యమైన హారర్ కామెడీ చిత్రం. మార్క్ సెట్ నెట్ వర్క్స్ బ్యానర్ పై డా. అభినిక ఐనాభాతుని నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ మోలోడీస్ సాంగ్స్ ఇచ్చిన అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రంలో హాస్యనటుడు వెన్నెల కిషోర్, షకలక శంకర్, బ్యూటీఫుల్ హీరోయిన్స్ నందితా శ్వేత, నవమి గాయక్ లతో పాటు రజిత్, నవీన్ నేని, రఘు తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ సాంగ్ అయిన పాప నువ్వు తోపు పాటను మీడియా సమక్షంలో రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ గా విడుదల చేసారు.

Advertisement GKSC

మొట్టమొదటిసారి మీడియా ప్రతినిధులతో పాటను ఆవిష్కరించిన ఘనత ఓఎంజీ టీమ్ కు దక్కింది. మంచి మాస్ బీట్ తో జానపద పాటని సినిమా స్టయిల్ లో మ్యూజిక్ డైరెక్టర్ అనూబ్ రూబెన్స్ అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ పాటను యువ రచయిత సింహాచలం రాయగా.. అలవైకుంటపురంలో సిత్తరాల సిరపడు పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలసురన్న పాడారు. అలాగే కమెడియన్ శకలక శంకర్ కూడా పాటలో కొంత భాగం పాడారు.

Advertisement
Author Image