ఈ రెస్టారెంట్లో వంటకాల్నే కాదు, గోడనీ రుచి చూస్తారు ? ఎందుకు ?
సాధారణంగా మనమేదైనా రెస్టారెంట్ కి వెళ్తే ఏంచేస్తాం? ఇంకేం చేస్తాం, భోజనం చేస్తాంగానీ, భజన చేస్తామా? మనకు కావలసినవో, అక్కడ దొరికేవాటిలో రుచికరమైనవో తినేసి బిల్లు చెల్లించి వచ్చేస్తాం... అంతేగా... అంటారేమో...! కానీ, అంతకు మించి వుండే కొన్ని రెస్టారెంట్ల గురించి ఈ వీడియోలో మాట్టాడుకుందాం. అమెరికాలోని ఓ రెస్టారెంట్ కి వెళ్లినవారు తిన్న తరువాత అక్కడి గోడను నాలుకతో ఆస్వాదించి మరీ వెను దిరుగుతారుట. ప్రపంచంలో విభిన్న రుచుల ఆహార పదార్ధాలను ఇష్టపడే ప్రజలు... అందుకు అనుగుణంగా భోజన ప్రియులకు రకరకాల ఆహారాన్ని అందించే అనేక రెస్టారెంట్లు వుంటాయి.
అయితే కొన్ని రెస్టారెంట్లు ఆహారానికి మాత్రమే గాక, వినియోగదారులను ఆకర్షించేందుకు డిఫరెంట్ లుక్, రకరకాల పద్ధతిలో ఆహారాన్ని వడ్డించడంలాంటివాటిని కూడా ఫాలో అవుతుంటాయి. భారతదేశంలోని అహ్మదాబాద్‌లోని నేచర్ కాల్ టాయిలెట్ కేఫ్ కూడా ఇందుకు ఒక ఉదాహరణ. ఈ రెస్టారెంట్ లో టాయిలెట్ సీటుపై కూర్చుని ప్రజలకు భోజనం వడ్డిస్తారు. అంతేకాదు, కాశ్మీర్ లో మంచుతోనే టేబుల్స్, చైర్స్ వున్న రెస్టారెంట్ ఒకటి పర్యాటకులకు ఆసక్తిని కలిగిస్తుంది.
ఇకపోతే, మనం మొదట్లో చెప్పుకున్న సదరు అమెరికా రెస్టారెంట్ గురించి కాస్త వివరంగా మాట్టాడుకుందాం. అమెరికాలో అరిజోనా మిషన్ అనే ఓ రెస్టారెంట్ వుంది. ఈ రెస్టారెంట్ లో భోజనం ఎంత పాపులరో ఇక్కడి గోడ అంతకన్నా పాపులర్. అందుకే, ఈ రెస్టారెంట్ లో భోజనం చేసిన తర్వాత గోడను నాలుకతో రుచి చూస్తారు. ఎందుకిలా? అనే సందేహం కలగక మానదు. నిజానికి ఈ రెస్టారెంట్ పింక్ హిమాలయన్ సాల్ట్ అంటే పింక్ సాల్ట్ తో తయారు చేశారు. అందుకనే ఈ రెస్టారెంట్ కు వచ్చేవారు. తప్పకుండా నాలుకతో ఈ గోడను రుచి చూస్తారు.
WLBT3 ప్రకారం, ఈ గోడను హెడ్ చెఫ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు ఈ గోడ రుచి నచ్చింది. అయితే, ఈ గోడను కస్టమర్స్ అందరూ నాలుకతో రుచి చూస్తారు అనగానే మరి, కరోనా సమయంలో కష్టం గదా... అనిపిస్తుంది. అయితే, రెస్టారెంట్ సిబ్బంది ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ గోడను తయారు చేసిన రాక్ సాల్ట్ లో బ్యాక్టీరియాను నశింపజేసే, శుభ్రపరచే లక్షణాలున్నాయని చెప్పారు. ఎవరూ అనారోగ్యం బారిన పడరని చెబుతున్నారు. అంతేగాదు, రెస్టారెంట్ లోని సిబ్బంది కూడా ప్రస్తుత పరిస్థితినీ, ఆరోగ్య ప్రాముఖ్యతనూ అర్థం చేసుకోవడంతో రోజూ తుడిచి శుభ్రం చేస్తుంటారుట.
ఈ కధనాలు మీ కోసమే See Now : - Honey for Face :తేనె వల్ల చర్మానికి ఎన్నో అద్భుత ప్రయోజనాలు ….అవేంటో ఇప్పుడు తెలుసుకోండి …
https://youtu.be/G0WBbiwY0V8