For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ టాకీ పార్ట్ పూర్తి

05:56 PM Jan 03, 2022 IST | Sowmya
Updated At - 05:56 PM Jan 03, 2022 IST
film news  హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ టాకీ పార్ట్ పూర్తి
Advertisement

తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు టాలెంటెడ్ యంగ్ స్టార్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్. స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో స‌క్సెస్‌ఫుల్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ పెన్ స్టూడియోస్ కాంబినేష‌న్‌లో ఛత్రపతి బాలీవుడ్ రీమేక్ రూపొందుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ టాకీ పార్ట్ రీసెంట్ గా కంప్లీట్ చేసుకుంది.

నిర్మాత ధవల్ జ‌యంతిలాల్ గ‌డ‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని పాత్ర కోసం బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ ఫిజికల్‌గా అద్భుతంగా ట్రాన్సార్మ్‌ అయ్యారు. ఆ లుక్ ను త్వరలో ప్రేక్షకులు చూడబోతున్నారు. ఛ‌త్ర‌ప‌తి చిత్రానికి క‌థ‌ను అందించిన స్టార్ రైట‌ర్‌, రాజ‌మౌళిగారి తండ్రి కె.వి.విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ రీమేక్‌కు క‌థ‌ను అందించారు.

Advertisement GKSC

ఈ సినిమాను ఓ మాస్టర్‌పీస్‌గా చేసేందుకు ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు వర్క్‌ చేస్తున్నారు. భలేభలే మగాడివోయ్, మహానుభావుడు వంటి తెలుగు హిట్‌ సినిమాలతో పాటుగా, తమిళ సినిమాలకు కూడా పని చేసిన సినిమాటోగ్రాఫర్‌ నిజర్‌ అలీ షఫీ ఈ సినిమాకు వర్క్‌ చేస్తున్నారు. తనిష్క్‌ బాచి ఈ చిత్రానికి స్వరకర్త. అన‌ల్‌ అర‌సు యాక్షన్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మహర్షి, గజిని, స్పెషల్‌ 26 వంటి చిత్రాలకు పని చేసిన ప్రముఖ ప్రొడక్షన్‌ డిజైనర్‌ సునీల్‌బాబు ఈ చిత్రానికి వర్క్‌ చేస్తున్నారు. మయూర్‌ పూరి ఈ చిత్రానికి డైలాగ్స్‌ అందిస్తున్నారు.Pen Studios Launching Bellamkonda Sai Sreenivas In Bollywood with Biggest Remake Of Prabhas and Rajamouli’s Chatrapathi wraps up its talkie part of the film,teluguworldnow.com.1నటీనటులు - బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సాహిల్ వాయిడ్, అమిత్ నాయర్, రాజేంద్ర గుప్తా, శివమ్ పాటిల్, స్వప్నిల్, ఆశిష్ సింగ్, మహమ్మద్ మొనజిర్, ఆరోషిక దేయ్, వేదిక, జాసన్ తదితరులు

సాంకేతిక నిపుణులు -
దర్శకత్వం - వి వి వినాయక్
కథ - కెవి విజయేంద్ర ప్రసాద్
సమర్పణ -  డాక్టర్ జయంతిలాల్ గడ
సహ నిర్మాతలు - ధవల్ జయంతి లాల్ గడ, అక్షయ్ జయంతి లాల్ గడ
బ్యానర్ - పెన్ స్టూడియోస్
డీవోపి - నిజార్ అలీ షఫి
స్టంట్ మాస్టర్ - అనల్ అరసు
సంగీతం - తనిష్క్ బాగ్చి
మాటలు - మయూర్ పూరి
ప్రొడక్షన్ డిజైన్ - సునీల్ బాబు
ఆర్ట్ - శ్రీను
కాస్ట్యూమ్ డిజైనర్ - అర్చనా మెహతా
పీఆర్వో - వంశీ శేఖర్

Advertisement
Author Image