BHAKTHI NEWS: పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర షురూ: మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
దేవరపెట్టే ను కదిలించి యాత్ర ను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి : "పెద్దగట్టు జాతర" ఎరియల్ వ్యూ
సూర్యాపేట మండలం కేసారం గ్రామంలోని ముంతబోయిన కుటుంబాల ఆధ్వర్యంలో 15 రోజులు ప్రత్యేక పూజ లు అందుకున్న దేవరపెట్టే ఆదివారం అర్థరాత్రి ప్రత్యేక పూజలు చేసి లింగమంతుల స్వామి అమ్మవారికి వారికి సమర్పించే కేసారం గ్రామానికి చెందిన గొర్ల వంశస్తుల ఇంటి నుండి పట్టు వస్త్రాలను మొదటి బోనంను నెత్తిన పెట్టుకుని గ్రామంలో మంత్రి ప్రదర్శన.. అనంతరం పెద్ద గట్టు పైకి చేరుకునే దేవరపెట్టే ను కదిలించి యాత్ర ను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి.
ప్రజా ప్రతినిధులు ,యాదవ పెద్దలతో కలిసి ఓ లింగా అంటూ బేరీలు వాయించి సందడి చేసిన మంత్రి, మంత్రి పూజల అనంతరం గుట్టపై కి సంప్రదాయ సంబరాల మధ్య దేవరపెట్టే ను తరలించిన యాదవ పెద్దలు, దేవర పెట్టె చేరిక తో పార్రంభమైన జాతర, కనువిందు చేస్తున్న గజ్జెల లాగులు ధరించిన యాదవుల నృత్యాలు, అడుగడుగున మంత్రి జగదీశ్ రెడ్డికి నివాళులతో కేసారం గ్రామ అడపడుచుల నివాళులు, భేరి నాదాలు, ఓ లింగా.. నామస్మరణతో మారుమ్రోగుతున్న పెద్దగట్టు పరిసర ప్రాంతాలు, నేటి నుండి నాలుగు రోజులపాటు జరగనున్న దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతర.
కార్యక్రమంలో మంత్రి తో పాటు పాల్గొన్న ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, డిసిఎం ఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేట ఎంపీపీ రవీందర్ రెడ్డి, జడ్పిటిసి జీడీ బిక్షం, పట్టణ కౌన్సిలర్లు చింతలపాపాటి భరత్,కుంభం రాజేందర్, జానీ, ముదిరెడ్డి సంతోష్ రెడ్డి, చెన్ను శ్రీనివాస్ రెడ్డి, పలువురు ప్రముఖ యాదవ నేతలు.