For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

"వకీల్ సాబ్" మూవీ రివ్యూ - పవన్ ఫాన్స్ కి పూనకాలే

02:54 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:54 PM May 11, 2024 IST
 వకీల్ సాబ్  మూవీ రివ్యూ   పవన్ ఫాన్స్ కి పూనకాలే
Advertisement

    వకీల్ సాబ్ మూవీ రివ్యూ

* వ‌కీల్ సాబ్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అంటూ రివ్యూలే రివ్యూలు
* వ‌కీల్ సాబ్ ప‌వ‌న్ కెరీర్ బెస్ట్ అంటోన్న ఆడియ‌న్స్
* కోర్టు సీన్లు హైలెట్ అంటోన్న ఫ్యాన్స్
* ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అంటోన్న ట్విట్ట‌ర్ రివ్యూస్
మూడేళ్ల త‌ర్వాత రిలీజైన ప‌వ‌ర్ స్టార్- ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ మూవీ వ‌కీల్ సాబ్. ఈ సినిమాకు రివ్యూలైతే అదిరిపోతున్నాయ్. సినిమా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ లోనే టాప్ అంటున్నారు.. కొంద‌రు యూఎస్, దుబాయ్ లో సినిమా చూసిన తెలుగు వారు. ఈ సినిమా ఒక మాస్ట‌ర్ పీస్ అ‌నీ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్ఫెమాన్స్ నెక్స్ట్ లెవ‌ల్లో ఉంద‌నీ.. కోర్టు సీన్లైతే అదిరిపోతున్నాయ‌నీ ట్వీట్ చేస్తున్నారు.
బేసిగ్గా సినిమా మ‌న‌క‌న్నా ముందే ప్రిమియ‌ర్లు చూసేస్తుంటారు.. విదేశాల్లోని కొంద‌రు. సెన్సార్ రివ్యూ- దుబాయ్ రివ్యూ అంటూ మ‌న‌కు సినిమా ఎలా ఉందో ముందుగానే ఒక స్మెల్ తెలిసిపోతుంది. ఇక్క‌డ హాల్లో ప‌డ‌క ముందే... అక్క‌డ చూసిన వాళ్లు.. బొమ్మ అదుర్స్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. వీట‌న్నిటినీ బ‌ట్టి చూస్తుంటే.. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ‌డం ఖాయ‌మంగా తెలుస్తోంది.

  • హిందీలోని పింక్ కి రీమేక్ గా వ‌చ్చిన వ‌కీల్ సాబ్
  •  3 ఏళ్ల త‌ర్వాత వ‌చ్చిన ప‌వ‌న్ సినిమా
  •  ఒక అమ్మాయి ఆత్మ‌గౌర‌వం చుట్టూ తిరిగే క‌థ‌
  •  హిందీ వ‌ర్షెన్ లో అమితాబ్, తాప్సీ, కీర్తి, ఆండ్రియా న‌ట‌న‌
  •  తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నివేదా థామ‌స్, అంజ‌లి, అన‌న్య‌, ప్ర‌కాష్ రాజ్
  • ట్రైల‌ర్ కే భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న వ‌కీల్ సాబ్
  •  ఇది మా క‌థ అంటున్న యువ‌తులు..అస‌లే క‌రోనా. ఆపైన టికెట్ల‌న్నీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ ప్యాక్ మూవీ.. వ‌కీల్ సాబ్ క‌థ ఎలా ఉండ‌బోతోంది? అన్న ఆస‌క్తి స‌ర్వ‌త్రా ఉంది. ఈ క‌థ మ‌రేం లేదు. పింక్ అనే హిందీ చిత్రానికిది రీమేక్ కాబ‌ట్టి. ఒక్క‌సారి పింక్ క‌థ ఏంటో తెలుసుకుంటే చాలు. దాదాపు వ‌కీల్ సాబ్ స్టోరీ కూడా ఇలాగే ఉండే అవ‌కాశ‌ముంది. అదేంటో ఇప్పుడు చూస్తే..
    అనిరుద్ధ రాయ్ చౌదురి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పింక్ చిత్ర క‌థ ద‌క్షిణ ఢిల్లీలోని ఒక అపార్ట్ మెంట్ లో మొద‌ల‌వుతుంది. మీనాల్- ఫ‌ల‌క్- ఆండ్రియా ఈ అపార్ట్ మెంట్లో ఉంటూ.. త‌లా ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. ఒక రోజు రాక్ షో త‌ర్వాత మీనాల్ కు ప‌రిచ‌య‌మున్న ర‌జ్వీర్ ఈ ముగ్గుర్నీ ఒక రెస్టారెంట్ కి డిన్న‌ర్ కి పిలుస్తాడు.
    ర‌జ్వీర్ ఇత‌డి ఇద్ద‌రు మిత్రులు చి‌త్తుగా తాగి ముగ్గురు అమ్మాయిల‌ను విడ‌దీసి.. త‌లా ఒక ప‌క్క‌కు తీసుకెళ్తారు. ఈ క్ర‌మంలో ర‌జ్వీర్- మీనాల్ ను బ‌లాత్కారం చేయ‌బోతాడు. దీంతో ఆమె నో అని అంటుంది. రిజ్వీ ఎంత‌కీ వినిపించుకో‌క‌పోయే స‌రికి.. ప‌క్క‌నే ఉన్న సీసాతో ఆమె అత‌డి నుదుటి మీద కొడుతుంది మీనాల్. దీంతో రిజ్వీ కంటికి తీవ్ర గాయ‌మ‌వుతుంది.
    రిజ్వీకి ద‌గ్గ‌ర బంధువైన ఒక రాజ‌కీయ నాయ‌కుడు... అత‌డికి స‌పోర్టుగా.. పోలీసుల‌ను కంట్రోల్ చేస్తాడు. దీంతో మీనాల్ ఇచ్చిన కంప్ల‌యింట్ ను పోలీసులు ఎంత‌కీ తీసుకోరు. పైపెచ్చు ఆమెపైనే హ‌త్యా య‌త్నం కేసు పెడ‌తారు. దీంతో మీనాల్ ను అరెస్టు చేస్తారు. కేసు పెద్దది అవుతుంది.
    ఈ అమ్మాయిలుండే అపార్ట్ మెంట్లో రిటైర్డ్ వ‌కీల్ దీప‌క్ సెహ‌గ‌ల్ మీనాల్ కేసు వాదించ‌డానికి ముందుకు వ‌స్తాడు. రిజ్వీ త‌ర‌ఫున వాదించిన వ‌కీలు.. మీనాల్ ఆమె మిత్రురాళ్లు చెడు తిరుగుళ్లు తిరిగేవార‌నీ.. రిజ్వీ అత‌డి మిత్రుల‌ను డ‌బ్బు కోసం ఈ రొంపిలోకి దింపే య‌త్నం చేశార‌నీ.. త‌ప్పుడు ఆధారాల‌ను చూపిస్తారు. అప్పుడు దీప‌క్ సెహ‌గ‌ల్ చేసిన వాద‌న ఈ సినిమాకు ప్రాణంగా నిలుస్తుంది.
    ఆడ‌పిల్ల విష‌యంలో స‌భ్య‌స‌మాజం ఎలాంటి అభిప్రాయాల‌ను క‌లిగి ఉంటుందో తూర్పార ప‌డుతుంది. ఒక‌మ్మాయి మీతో క‌ల‌సి పార్టీకి వ‌చ్చినంత మాత్రాన‌.. మందు కొట్టినంత మాత్రాన‌.. అన్నిటికీ ఒప్పుకున్న‌ట్టు కాదు. నో అంటే నో అనే అర్ధం. ఒక‌మ్మాయి లేదా స్త్రీ లేదా భార్యా లేదా గాళ్ ఫ్రెండ్ లేదా కాల్ గాళ్ లేదా ఎవ్వ‌రైనా కావ‌చ్చు.. నో అంటే నో అనే అర్ధం. ఆమె కాద‌న్నా ఆమె మీద‌కు మీరు విరుచుకుప‌డితే అది అత్యాచారం కింద‌కు వ‌స్తుంది. కాదు అనేది కేవ‌లం ప‌దం కాదు. అదొక పూర్తి వాక్యం. కోపం- భ‌యం- నిర్లిప్త భావంతో నిల‌బ‌డిపోయిన మీనాల్ ఆమె స్నేహితురాళ్ల‌నుద్దేశించి.. ఒక అద్భుత‌మైన క‌విత‌తో ఈ చిత్రం ముగుస్తుంది.
    ఈ అంశాల‌న్నిటినీ త‌మ‌విగా భావించిన యువ‌తులు.. ఈ చిత్రాన్ని దాదాపు ఓన్ చేసుకుంటున్న‌ట్టుగా సినిమా విడుద‌ల‌కు ముందే సోష‌ల్ మీడియా పోస్టింగులు పెడుతున్నారు. దానికి తోడు ఈ సినిమా మ‌హిళాలోకానికి తాము స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తున్న అంకితంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లోనూ చెప్పారు. కాబ‌ట్టి.. దిస్ మూవీ కంప్లీట్ లీ డెడికేటెడ్ టూ ద యంగ్ గాళ్స్. నో డౌట్ అబౌటిట్!
Advertisement GKSC
Advertisement
Author Image