For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Unstoppable 2 : అన్ స్టాపబుల్ షో లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్..

09:54 PM Jan 27, 2023 IST | Sowmya
Updated At - 09:54 PM Jan 27, 2023 IST
unstoppable 2   అన్ స్టాపబుల్ షో లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్
Advertisement

Unstoppable 2 : నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్ 2’ టాక్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. మొదటి సీజన్లో భారీ విజయం అందుకున్న ఈ షో.. ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా సక్సెస్ ఫుల్‏గా నిలిచింది. గత సీజన్ కంటే భిన్నంగా.. రెండో పార్ట్ లో సెలబ్రెటీలతోపాటు.. రాజకీయ ప్రముఖులు సైతం వచ్చేశారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం తన స్నేహితుడితో కలిసి సందడి చేశారు. డార్లింగ్ ఎపిసోడ్ కు వచ్చిన రెస్పాన్స్ గురించి తెలిసిందే. ఇక ఇప్పుడు సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఎపిసోడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది అనే చెప్పాలి.

ఇటీవలే ఆయన ఈ షోకు విచ్చేయగా.. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సంచలనాన్ని సృష్టించాయి. మొదటి సారి బాలయ్యతో కలిసి టాక్ షోలో పాల్గోనడంతో ఈ ఎపిసోడ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. వచ్చిన గెస్టులతో సరదాగా ముచ్చటించడమే కాకుండా వారిని ఆటపట్టిస్తూ బాలయ్య చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ఓ ప్రోమోను రిలీజ్ చేశారు షో నిర్వాహకులు. ఈ షో ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని చెప్పాలి.

Advertisement GKSC

పవన్ కూడా చాలా ఫ్రీగా తనదైన స్టయిల్‌లో సమాధానాలు ఇస్తూ.. బాలయ్యతో చేసిన రచ్చ మనకు ఈ ప్రోమోలో చూపెట్టారు. అయితే ఈ ప్రోమోలో మరో అంశం హైలైట్‌గా నిలిచింది. అదే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సర్‌ప్రైజ్ ఎంట్రీ. పంచెకట్టుతో తేజు స్టేజీపైకి రావడంతోనే బాలయ్య ఆయన్ను ఓ రేంజ్‌లో ఆటాడుకున్నారు. ఇవేమన్నా పెళ్లిచూపులా.. అంటూ తేజుకి సెటైర్ వేశాడు బాలయ్య. దీంతో తేజు అమ్మాయిల గురించి మాట్లాడుతూ.. హార్రర్ సినిమాలకి, అమ్మాయిలకి తేడా లేదంటూ బదులిచ్చాడు. అయితే తేజు ఆన్సర్‌కి ఇంటికెళ్లాక బడితపూజేనా అని పవన్‌ను అడగ్గా.. కొద్దిగా ఉంటుందని పవన్ సరదాగా చెప్పుకొచ్చాడు.

అయితే తనకు అమ్మాయిలను ఎలా గౌరవించాలో పవన్ నేర్పించాడని తేజు చెప్పుకురావడం విశేషం. అయితే ఓసారి తొడ కొట్టవా అంటూ తేజుని అడగగా.. బాలయ్య వద్దకు వచ్చి ఆయన తొడను కొట్టే ప్రయత్నం తేజు చేశాడు. దీంతో ‘నా తొడకాదయ్యా..’ అంటూ బాలయ్య అనడంతో పవన్ నవ్వుకున్నాడు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది.

Advertisement
Author Image