Political : "మనిషి ఎంత ఎత్తుకు ఎదుగుతాడో ఈ ధరిత్రి మీద అతని నీడ అంత సుదీర్ఘంగా పడుతుంది.." ప్రధాని మోదీపై పవన్ కళ్యాణ్ ట్వీట్..
Political భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనల్లో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే అయితే ఈ సందర్భంగా మోడీ వ్యక్తిత్వాన్ని గురించి పవన్ కళ్యాణ్ చేసిన ఓ ట్వీట్ తాజాగా వైరల్ గా మారింది..
ప్రధాని మోదీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హోటల్ ఐఎన్ఎస్ చోళలో భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య 30 నిమిషాల పాటు సంభాషణ కొనసాగింది ఈ సమయంలో వీరి మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితుల కోసం.. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాల కోసం చర్చ జరిగినట్టు సమాచారం.. రాష్ట్ర పరిస్థితులను ఎలాగైనా మెరుగుపరచాలని.. లేదంటే రోజురోజుకు దిగజారి పోతున్నాయని వీరిద్దరూ సంభాషించుకున్నారని తెలుస్తోంది.. అలాగే రాష్ట్ర పరిస్థితులను వివరించేందుకు ఎంతో విలువైన సమయాన్ని తనకు కేటాయించేందుకు మోడీకి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు..
అంతే కాకుండా తనకు ఇష్టమైన శేషేంద్ర శర్మ చెప్పిన కవితా పంక్తులను చెబుతూ.. ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద.. అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ .. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్థానానికి అద్దంపడతాయన్నారు. అలాగే దేశం ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో దేశ ప్రధానిగా పాలన చేపట్టి.. ప్రాంతీయవాదాలు, సాంస్కృతిక వైరుధ్యాలు అన్నింటినీ అర్థం చేసుకొని అన్నిటిని సమానంగా ఆదరించి.. ప్రతి ఒక్కరిలో భారతీయులం అనే భావనను నింపారని హర్షం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్..
‘ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద.. అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ’- శేషేంద్ర చెప్పిన ఈ కవితా పంక్తులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రస్థానానికి అద్దంపడతాయి. @narendramodi @PMOIndia pic.twitter.com/D3sf7SMaKQ
— Pawan Kalyan (@PawanKalyan) November 14, 2022