Entertainment : ఒకే నెలలో థియేటర్లో సందడి చేయబోతున్న పవర్ స్టార్, సూపర్ స్టార్ హిట్ చిత్రాలు..
Entertainment మరి కొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అభిమానులకు పండగ వాతావరణం మొదలుకానుంది దీనికి కారణం వీరిద్దరి సూపర్ హిట్ సినిమాలు మళ్లీ థియేటర్లో సందడి చేయడమే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడు చిత్రం అభిమానుల ముందుకు రానుంది..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒకప్పటి హిట్ చిత్రాలు మళ్లీ విడుదలకు సిద్ధమవుతున్నాయి దీంతో వీరిద్దరి అభిమానుల్లో ఆనందం నెలకొంది.. ఈ సినిమాలు కొత్తవి కాదు ఒకప్పుడు విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన సినిమాలు డిసెంబర్ 31న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు హీరోగా మరో స్థాయికి తీసుకెళ్లిన ఖుషి సినిమా విడుదల కాబోతుంది.. ఈ సినిమా వారం రోజులు పాటు థియేటర్లో సందడి చేయనుంది.. 2001లో విడుదలైన ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరొక స్థాయికి తీసుకువెళ్లింది హీరోగా ఇతని స్థాయిని నిలబెట్టిన సినిమా ఖుషి అనే చెప్పవచ్చు..
అలాగే జనవరి 7న సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడు చిత్రం అభిమానుల ముందుకు రానుంది.. ఈ సినిమాలో మహేష్ చావ్లా భూమిక చావ్లా నటించిన ప్రకాష్ రాజు మరో కీలకపాత్ర పోషించారు.. అయితే ఈ రెండు సినిమాల్లో భూమిక చావ్లా హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.. ఈ రెండు సినిమాలు అప్పట్లో ప్రేక్షకుల్ని ఎంతగా అల్లరించాయో అందరికీ తెలిసిందే.. అయితే టాలీవుడ్ లో ఒకేసారి ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండటంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది..