For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

విష్ణు మంచు సినిమా 'మోస‌గాళ్లు'లో "పైసా మే హీ" సాంగ్ లిరిక‌ల్ వీడియో విడుద‌ల‌

02:01 PM May 03, 2024 IST | Sowmya
Updated At - 02:01 PM May 03, 2024 IST
విష్ణు మంచు సినిమా  మోస‌గాళ్లు లో  పైసా మే హీ  సాంగ్ లిరిక‌ల్ వీడియో విడుద‌ల‌
Advertisement

విష్ణు మంచు హీరోగా న‌టిస్తోన్న భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'మోస‌గాళ్లు' కోసం ప్రేక్ష‌కులు అమితాస‌క్తితో ఎదురు చూస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా ఫిల్మ్‌గా ఇది విడుద‌లవుతోంది.

24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై 'మోస‌గాళ్లు' చిత్రాన్ని నిర్మిస్తోన్న విష్ణు మంచు దాన్ని చ‌క్క‌గా ప్ర‌మోట్ చేస్తుకుంటూ వ‌స్తున్నారు. ఈరోజు "పైసా మే హీ ప‌ర‌మాత్మా హై" అనే పాట లిరిక‌ల్ వీడియోను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ప్ర‌పంచ‌మంతా డ‌బ్బు చుట్టూ తిరుగుతుంద‌నే విష‌యాన్ని ఆ లైన్ ద్వారా మ‌నం అంద‌రం చెప్పుకుంటూ ఉంటాం. ఆ లైన్‌తో గేయ‌ర‌చ‌యిత సిరాశ్రీ ఈ పాట‌ను ఆక‌ట్టుకునేలా రాశారు. "దేవుడైనా హుండీ ముందే.. డ‌బ్బే లేరా ఆక్సీజ‌నూ" అనే లైన్లు నేటి స‌మాజంలోని వాస్త‌వ ప‌రిస్థితికి అద్దం ప‌ట్టేలా ఉన్నాయి. శ్యామ్ సీఎస్ చ‌క్క‌ని మ్యూజిక్ ఇచ్చిన ఈ సాంగ్‌ను లావిటో లోబో హ‌స్కీ వాయిస్‌తో పాడారు. సినిమాలో ఇది బ్యాగ్రౌండ్ సాంగ్‌గా వ‌స్తుంద‌ని ఊహించ‌వ‌చ్చు. 'మోస‌గాళ్లు' సినిమా క‌థ సారాశ‌మంతా ఈ పాట‌లో ఉంది‌.

Advertisement GKSC

జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో విష్ణు సోద‌రిగా కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌నిపించ‌నుండ‌టం ఓ విశేషం. విష్ణు జోడీగా రుహీ సింగ్ క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సునీల్ శెట్టి ఓ కీల‌క పాత్ర చేశారు.

తారాగ‌ణం:
విష్ణు మంచు, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సునీల్ శెట్టి, రుహీ సింగ్, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర‌

సాంకేతిక బృందం:
మ్యూజిక్‌: శ‌్యామ్ సీఎస్‌
సినిమాటోగ్ర‌ఫీ: షెల్డ‌న్ చౌ
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: కిర‌ణ్‌కుమార్ ఎం.
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్‌కుమార్ ఆర్‌.
నిర్మాత‌: విష్ణు మంచు
ద‌ర్శ‌క‌త్వం: జెఫ్రీ గీ చిన్‌
బ్యాన‌ర్‌: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ.

Advertisement
Author Image