యశ్వంత్ సిన్హాకు స్వాగత ఏర్పాట్లతో తెరాస నాయకులు బిజీ
03:13 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:13 PM May 11, 2024 IST
Advertisement
జులై 2వ తేదీన హైదరాబాద్‌కు రానున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి శ్రీ యశ్వంత్ సిన్హా, ఈ నేపథ్యంలో యశ్వంత్ సిన్హాకు స్వాగత ఏర్పాట్లు, ఆయనకు మద్ధతుగా నిర్వహించే సభపై హైదరాబాద్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్.
యశ్వంత్ సిన్హాకు ఘనంగా స్వాగతం పలకాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రజా ప్రతినిధులకు కేటీఆర్ ఆదేశం. జులై 2వ తేదీన ఉదయం 10 గంటలకు యశ్వంత్ సిన్హా బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి జలవిహార్ వరకు 10 వేల బైకులతో ర్యాలీ.. ఉదయం 11 గంటలకు జలవిహార్ లో యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహించనుంది.
Advertisement
