For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: "ఊరికి ఉత్త‌రాన‌" ఖచ్చితంగా హిట్ అవుతుంది: హీరో నరేన్

09:54 PM Nov 17, 2021 IST | Sowmya
Updated At - 09:54 PM Nov 17, 2021 IST
film news   ఊరికి ఉత్త‌రాన‌  ఖచ్చితంగా హిట్ అవుతుంది  హీరో నరేన్
Advertisement

నరేన్, దీపాలి శర్మ జంటగా నటించిన సినిమా `ఊరికి ఉత్తరాన`. ఈ చిత్రాన్నిఈగల్ ఐ ఎంటైర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వనపర్తి వెంకటయ్య , రాచాల యుగంధర్ నిర్మించారు. సతీష్ అండ్ టీమ్ దర్శకత్వం వహించిన `ఊరికి ఉత్త‌రాన‌` సినిమా ఈ నెల 19న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిత్ర బృందం పాల్గొన్నారు.

టాలీవుడ్ లో చిన్న సినిమాలకు ఎన్ని కష్టాలుంటాయో మీకు తెలుసు. మేమూ ఆ ఇబ్బందులన్నీ పడ్డాం. ఫైనల్ గా సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. `ఊరికి ఉత్త‌రాన‌` సినిమా సక్సెస్ మీట్ కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాం. సినిమా మీద అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మేము ఎందుకు ఇంత ఆత్మవిశ్వాసంతో ఉన్నాం అనేది సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ ఇది. సినిమా కోసం వేసిన వరంగల్ సెట్ ప్రత్యేక ఆకర్షణ అవుతుంది అని హీరో నరేన్ అన్నారు.

Advertisement GKSC

ఊరికి ఉత్త‌రాన‌` మీరు రెగ్యులర్ గా చూసే లవ్ స్టోరి కాదు. చాలా కొత్త కథ, ప్లెజంట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఈ చిత్రంలో శైలు అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ పాత్రను బ్యూటిఫుల్ గా మలిచారు మా దర్శకుడు సతీష్. నా క్యారెక్టర్ మాత్రమే కాదు సినిమాలో ప్రతి పాత్ర అద్భుతంగా ఉంటుంది. హీరో నరేన్ నాకు కంప్లీట్ గా సపోర్ట్ చేసి బాగా నటించేలా చేశారు. `ఊరికి ఉత్త‌రాన‌` థియేటర్లలో తప్పకుండా చూడండి హీరోయిన్ అని దీపాలి శర్మ అన్నారు.

రామరాజు, మల్లేశం ఫేం ఆనంద చక్రపాణి, ఫణి, జగదీష్ లు ప్రధాన పాత్రల్లో న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః శ్రీకాంత్ అరుపుల‌; సంగీతంః భీమ్స్ సిసిరోలియో- సురేష్ బొబ్బిలి; సాహిత్యంః సురేష్ గంగుల‌, పూర్ణాచారి; పీఆర్వోః వంశీ-శేఖ‌ర్‌; కో-ప్రొడ్యూస‌ర్ః రాచాల యుగంధ‌ర్; నిర్మాతః వ‌న‌ప‌ర్తి వెంక‌ట‌య్య‌, ద‌ర్శ‌క‌త్వంః స‌తీష్ అండ్ టీమ్.

Ooriki Utharana Movie Going to Give Big Hit,Hero Naren,Deepali Sharma,Latest Telugu Movies,telugu golden tv,my mix entertainments,www.teluguwolrdnow.com

Advertisement
Author Image